IND vs ENG 1st Test: అందరి చూపు ఆయన వైపే.. రెండో రోజు ఉప్పల్‌లో ఉత్కంఠ..

India vs England Second Test, Day 2: భారత్ స్పిన్ ధాటికి కంగుతిన్న ఇంగ్లిష్ భారీ స్కోరు సాధించలేక 246 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులు వెనుకంజలో నిలిచింది. 76 పరుగులు చేసిన జైస్వాల్ పైనే అందరి దృష్టి నిలవడంతో రెండో రోజు ఆట ఉత్కంఠ రేపుతోంది.

IND vs ENG 1st Test: అందరి చూపు ఆయన వైపే.. రెండో రోజు ఉప్పల్‌లో ఉత్కంఠ..
Ind Vs Eng Yashasvi Jaiswal

Updated on: Jan 26, 2024 | 9:39 AM

India Vs England 1st Test Day 2: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. టాస్ ఓడిపోయినప్పటికీ, రోహిత్ జట్టు మొదటి రోజు సత్తాచాటింది. దీంతో ఇంగ్లాండ్ జట్టును 246 పరుగులకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు సఫలమయ్యారు. భారత్‌ స్పిన్‌ ధాటికి ఇంగ్లిష్‌ ఆటగాళ్లు భారీ స్కోరు సాధించలేకపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులు వెనుకంజలో నిలిచింది. 76 పరుగులు చేసిన జైస్వాల్ పైనే అందరి దృష్టి నిలవడంతో రెండో రోజు ఆట ఉత్కంఠ రేపుతోంది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జాక్ క్రాలే (20 పరుగులు), బెన్ డకెట్ (35 పరుగులు) తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వచ్చిన ఓలీ పోప్ కేవలం 1 పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా, ఆ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ 29 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

అనుభవజ్ఞుడైన జానీ బెయిర్‌స్టో కూడా 37 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. కానీ, లోయర్ ఆర్డర్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌కు మద్దతుగా నిలిచిన టామ్ హార్ట్లీ 23 పరుగులు చేశాడు.

టీమిండియా స్పిన్నర్లు తెలివిగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాజ్ బాల్ క్రికెట్‌కు ధీటుగా సమాధానం ఇచ్చారు. జట్టు తరపున రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌లు చెరో 3 వికెట్లు తీయగా, మరో ఆఫ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కో వికెట్‌ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ (24) తుఫాన్ ఆరంభాన్ని అందించారు (80 పరుగుల భాగస్వామ్యం). ఆరంభం నుంచే దూకుడు ఆటను ప్రారంభించిన జైస్వాల్ 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు. గిల్ అజేయంగా 14 పరుగులు చేసి నేడు బ్యాటింగ్ కొనసాగించాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us