
IND vs ENG Day 2 Highlights: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. గురువారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు 246 పరుగులకు ఆలౌటైంది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆడుతోన్న భారత్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 81 పరుగులు, అక్షర్ పటేల్ 35 పరుగులతో నిలిచారు. జడేజా తన టెస్టు కెరీర్‌లో 20వ అర్ధశతకం సాధించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 175 పరుగుల ఆధిక్యం సాధించింది.
కేఎస్ భరత్ 41 పరుగుల వద్ద, కేఎల్ రాహుల్ 86 పరుగుల వద్ద, యశస్వి జైస్వాల్ 80 పరుగుల వద్ద ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2 వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, జో రూట్ తలో వికెట్ తీశారు.
కాగా, శుక్రవారం భారత జట్టు 119/1 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.
Stumps on Day 2 in Hyderabad! 🏟️#TeamIndia move to 421/7, lead by 175 runs 🙌
See you tomorrow for Day 3 action 👋
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/sul21QNVgh
— BCCI (@BCCI) January 26, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, మార్క్ వుడ్.
15 runs off the final over of Day 2 courtesy @akshar2026 🔥🔥
The Jadeja-Axar partnership now 63*-runs strong 💪
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/8AxB79zCyS
— BCCI (@BCCI) January 26, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..