IND vs ENG 1st ODI Live: టీమిండియా బౌలర్ల సెక్సెస్.. ‌ 66 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం

| Edited By: Sanjay Kasula

Mar 23, 2021 | 10:08 PM

India vs England score updates: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదించలేక....

IND vs ENG 1st ODI Live: టీమిండియా బౌలర్ల సెక్సెస్.. ‌ 66 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం
Virat Kohli Eoin Morgan

India vs England score updates:  ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదించలేక పోయారు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు. 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.  

అంతకు ముందు… ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 318 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన అదరగొట్టింది.  5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 106 బంతుల్లో 98  పరుగులు చేశాడు. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సెంచరీకి  2 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సారథి విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడి అర్ధశతకం చేయగా… చివర్లో  కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్య  మెరుపులు మెరిపించారు. సిక్సర్లతో దుమ్ము రేపారు. భారత ఆటగాళ్లను కట్టడి చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.  బెన్‌స్టోక్స్‌ 3, మార్క్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు.

వన్డేల్లో ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన కృనాల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడు చేసిన హాఫ్ సెంచరీని కొన్నాళ్ల క్రితం మరణించిన తండ్రికి అంకితమిచ్చాడు.

పొట్టి ఫార్మాట్ ముగిసింది. వన్డే సిరీస్ మొదలైంది. జోష్ మీదున్న టీమిండియా ఇవాళ్టి నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తలబడేందుకు సిద్దమైంది. పూణే వేదికగా జరుగుతోన్న మొదటి వన్డేలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు కీలక ప్లేయర్స్ జో రూట్, జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. టీమిండియాలో పలు కీలక మార్పులు జరిగాయి. టీ20లలో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. కృనాల్ పాండ్యా, యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.

Key Events

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్):

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ ఎలెవన్):

జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్) జోస్ బట్లర్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 Mar 2021 09:41 PM (IST)

    డెబ్యూ మ్యాచ్‌లోనే అదరగొట్టిన ప్రసిధ్ కృష్ణ

    డెబ్యూ మ్యాచ్‌లోనే ప్రసిధ్ కృష్ణ అదరగొట్టాడు. ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చిన ప్రసిధ్‌ రెండో స్పెల్‌లో చెలరేగిపోయాడు. 8.1 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అందులో ఒక మెయిడిన్‌ ఓవర్‌ కూడా ఉంది. మరో డెబ్యూ ఆటగాడు కృనాల్‌ పాండ్యకు ఒక వికెట్‌ దక్కింది.

     

  • 23 Mar 2021 09:37 PM (IST)

    66 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం

    ఇంగ్లాండ్ ఆటగాళ్లను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇంగ్లాండ్‌ కేవలం 251పరుగులకే పరిమితం అయింది. దీంతో భారత్‌ 66 పరుగుల తేడాతో గెలిచింది.


  • 23 Mar 2021 09:36 PM (IST)

    ఇంగ్లాండ్‌ పదో వికెట్‌ కోల్పోయింది…

    ఇంగ్లాండ్‌ పదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిధ్‌కృష్ణ వేసిన బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన టామ్‌ కరన్‌.. భువనేశ్వర్‌ చేతికి చిక్కాడు. కరన్‌ ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్‌ ఓటమి ఖరారైంది.

  • 23 Mar 2021 09:13 PM (IST)

    భువీ అద్భుత బౌలింగ్.. 2 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు…

    భువీ 2 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. టామ్‌ , సామ్‌ క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 09:12 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. మొయిన్‌ అలీ ఔట్..

    ఇంగ్లాండ్‌ మరో వికెట్‌ చేజార్చుకుంది. భువనేశ్వర్‌ వేసిన 37.1వ బంతికి మొయిన్‌ అలీ  ఔటయ్యాడు. రాహుల్‌ క్యాచ్‌ పట్టేశాడు.దీంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది.

  • 23 Mar 2021 09:00 PM (IST)

    6వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్‌ 6వ వికెట్‌ చేజార్చుకుంది. ప్రసిధ్ వేసిన 32.1వ బంతికి  సామ్‌ బిల్లింగ్స్‌ ఔటయ్యాడు. కోహ్లీ సులువుగా క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 217/6తో ఉంది.

  • 23 Mar 2021 08:24 PM (IST)

    శార్దూల్‌ సూపర్ బౌలింగ్‌

    శార్దూల్‌ సూపర్ బౌలింగ్‌ చేశాడు. మోర్గాన్‌, బట్లర్‌ను  ఇంటికి పంపించాడు. అలీ (0), బిల్లింగ్స్‌ (1) క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 08:22 PM (IST)

    జోస్‌ బట్లర్ ఔట్

    శార్దూల్‌ అదరగొట్టాడు. 24.4వ బంతికి జోస్‌ బట్లర్  ఔటయ్యాడు. వికెట్ల ముందు దొరికిపోయాడు. అతడు సమీక్ష కోరినప్పటికీ విఫలమైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 176/5తో  ఉంది.

  • 23 Mar 2021 07:26 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…

    టీమిండియా నిరీక్షణ ఫలించింది. ఇంగ్లాండ్ తొలి వికెట్ పడింది. ప్రసిధ్‌ వేసిన 14.2 బంతికి జేసన్‌ రాయ్‌ ఔటయ్యాడు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్లో అతడిచ్చిన క్యాచ్‌ను సూర్య కుమార్‌ అందుకున్నాడు.

  • 23 Mar 2021 07:18 PM (IST)

    వరుస సిక్సర్లతో బెయిర్‌ స్టో.. హాఫ్ సెంచరీకి  దగ్గరలో రాయ్

    కృనాల్‌ 15 పరుగులు ఇచ్చాడు. నాలుగు, ఐదో బంతుల్ని బెయిర్‌ స్టో (74) సిక్సర్లుగా మలిచాడు. రాయ్‌ (40) హాఫ్ సెంచరీకి  దగ్గరలో ఉన్నాడు.

  • 23 Mar 2021 06:38 PM (IST)

    కృనాల్‌ భావోద్వేగం.. తొలి హాఫ్ సెంచరీ తండ్రికి అంకితం..

    వన్డేల్లో ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన కృనాల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడు చేసిన హాఫ్ సెంచరీని కొన్నాళ్ల క్రితం మరణించిన తండ్రికి అంకితమిచ్చాడు.

  • 23 Mar 2021 05:55 PM (IST)

    50 ఓవర్లకు భారత్‌ 317 పరుగులు..

    50 ఓవర్లకు భారత్‌ 317/5 పరుగులు చేసింది. మార్క్‌వుడ్‌ 13 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని కృనాల్‌ (58 పరుగులు), ఆఖరి బంతిని రాహుల్‌ (62 పరుగులు) బౌండరీకి తరలించారు. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.

  • 23 Mar 2021 05:01 PM (IST)

    హార్దిక్ పాండ్యా ఔట్..

    నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. స్లిప్స్‌లో బౌండరీగా మార్చే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా చేతికి దొరికి పోయాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  ఔటయ్యాక టీమిండియా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ దారి పట్టారు.  తాజాగా హార్దిక్‌ పాండ్య(1) ఔటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్‌ మూడో బంతికి స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 205 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది.

  • 23 Mar 2021 04:39 PM (IST)

    శిఖర్ ధావన్ ఔట్.. సెంచరీ మిస్..

    స్టోక్స్ వేసిన 39.1 ఓవరల్‌లో శిఖర్ ధావన్ ఔటయ్యాడు. 98 పరుగుల వద్ద ఔటయ్యాడు.  106 బంతుల్లో 98 పరుగులు చేశాడు. ఇందులో 11 బౌండరీలు , 2 సిక్సర్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే త్రుటిలో ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీని చేజార్చుకున్నాడు. స్టోక్స్‌ వేసిన 39వ ఓవర్‌ తొలి బంతికి పుల్‌షాట్‌ ఆడబోయి మోర్గాన్‌ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 197 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

  • 23 Mar 2021 04:21 PM (IST)

    శ్రేయాస్ అయ్యర్ ఔట్

    మార్క్ వుడ్ వేసిన బంతిని శ్రేయాస్ అయ్యర్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు.

  • 23 Mar 2021 04:04 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్.. ఎలానో తెలుసా…

    విరాట్ కోహ్లీ భారీ షాట్‌ కోసం ప్రయత్నించి  ఔటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన 32.1 బంతికి బౌండరీలో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. క్రీజ్‌లోకి‌ శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు.

  • 23 Mar 2021 04:01 PM (IST)

    విరాట్‌..వన్డేల్లో 61వ హాఫ్ సెంచరీ

    ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ వన్డేల్లో 61వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లోనే 50 మార్క్‌ చేరుకున్నాడు. శిఖర్‌ ధావన్‌, కోహ్లీ జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

  • 23 Mar 2021 03:50 PM (IST)

    శిఖర్ ధావన్‌కు లభించిన లైఫ్…

    హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తోంది ఇంగ్లాండ్. అయితే అదిల్‌ రషీద్‌ వేసిన 28వ ఓవర్‌లో శిఖర్‌ధావన్‌ జస్ట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శిఖర్ బాధిన షాట్‌ను క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన మోయిన్‌ అలీ జారవిడిచాడు. దీంతో ధావన్‌కు ఒక మంచి లైఫ్ దొరికింది.

  • 23 Mar 2021 03:40 PM (IST)

    సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్…

    70 బంతుల్లో  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్. అదిల్‌ రషీద్‌ వేసిన 24వ ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇదే ఓవర్‌ ఐదో బంతికి కోహ్లీ(27) బౌండరీ బాదడంతో మొత్తం 12 పరుగులొచ్చాయి.

  • 23 Mar 2021 03:38 PM (IST)

    హాఫ్ సెంచరీ వైపు ధావన్

    అదిల్‌ రషీద్‌ వేసిన 22వ ఓవర్‌లో నాలుగు పరుగులొచ్చాయి. ధావన్‌(45) హాఫ్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు.  కోహ్లీ(18) పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

  • 23 Mar 2021 03:36 PM (IST)

    కోహ్లీ బౌండరీ

    బెన్‌స్టోక్స్‌ వేసిన 21వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లీ(15) బౌండరీ కొట్టాడు. దీంతోపాటు ఈ ఓవర్‌లో మరో రెండు సింగిల్స్‌ వచ్చాయి.

  • 23 Mar 2021 03:35 PM (IST)

    20 ఓవర్లు పూర్తయ్యేసరికి…

    20 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. అదిల్‌ రషీద్‌ వేసిన ఈ ఓవర్‌లో మూడు పరుగులే వచ్చాయి. ధావన్‌(43), కోహ్లీ(10) ఆచితూచి ఆడుతున్నారు

  • 23 Mar 2021 02:42 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న టీమిండియా.. 10 ఓవర్లకు 39-0

    టీమిండియా బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి 39-0 పరుగులు చేసింది. ధావన్(20), రోహిత్ శర్మ(19) క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 02:40 PM (IST)

    తొమ్మిదో ఓవర్‌లో రెండు ఫోర్లు..

    రోహిత్ శర్మ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 9వ ఓవర్‌లో రోహిత్ వరుసగా ఫోర్లు బాదాడు. దీనితో తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి 34/0 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(17), ధావన్(17)తో క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 02:38 PM (IST)

    ఏడో ఓవర్‌లో రెండు ఫోర్లు..

    ధావన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన బౌలింగ్‌లో ధావన్ వరుసగా ఫోర్లు బాదాడు. దీనితో ఏడు ఓవర్లు ముగిసేసరికి 24/0 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(8), ధావన్(16)తో క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 02:35 PM (IST)

    వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు..

    సామ్ కరన్, మార్క్ వుడ్ ఓవర్లు మెయిడిన్ ఓవర్లుగా ముగిశాయి. దీనితో టీమిండియా 5 ఓవర్లు ముగిసేసరికి 10 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(4), ధావన్(6)తో ఉన్నారు.

  • 23 Mar 2021 02:32 PM (IST)

    ధావన్ మొదటి ఫోర్..

    మార్క్ వుడ్ వేసిన మూడో ఓవర్‌లో ధావన్ మొదటి ఫోర్ బాదాడు. దీనితో మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 10 పరుగులు చేసింది. ధావన్(6), రోహిత్ శర్మ(4)తో క్రీజులో ఉన్నారు.

  • 23 Mar 2021 02:29 PM (IST)

    మొదటి ఓవర్‌లో ఒక పరుగు..

    మార్క్ వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో టీమిండియా ఒక్క పరుగు మాత్రమే రాబట్టగలిగింది. టీమిండియా ఒక ఓవర్ ముగిసేసరికి 1-0 పరుగులు చేసింది. ధావన్(0), రోహిత్ శర్మ(1) క్రీజులో ఉన్నారు.

Follow us on