India Vs England: తొలి టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఇంగ్లాండ్ విజయం.. స్కోర్ల వివరాలివే..

|

Feb 09, 2021 | 1:40 PM

India Vs England 1st Test Day 5: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైంది. 232 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది.

India Vs England: తొలి టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఇంగ్లాండ్ విజయం.. స్కోర్ల వివరాలివే..

India Vs England 1st Test Day 5: చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా ఓటమిపాలైంది. 232 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. 39 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. 187 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) అర్ధ శతకాలు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ నాలుగు వికెట్లు, ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బ తీశారు. దీనితో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. కాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జో రూట్ ఎంపికయ్యాడు.

టీమిండియా ఆలౌట్…

చివరి వికెట్ గా ఇషాంత్ పెవిలియన్ చేరడంతో ఇండియా 192 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.

తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. లీచ్ బౌలింగ్‌లో నదీమ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు.

కోహ్లీ ఔట్.. టీమిండియా ఆశలు గల్లంతు..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీనితో భారత్ విజయ అవకాశాలు దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు. ఇంకా విజయం కోసం టీమిండియా 241 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లాండ్‌కు మరో రెండు వికెట్లు వస్తే చాలు..

ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా..

టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లీచ్ బౌలింగ్‌లో అశ్విన్(9) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 171 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది.

కోహ్లీ అర్ధ సెంచరీ.. గెలవాలంటే ఇంకా 250 పైచిలుక పరుగులు అవసరం..

సెకండ్ ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్న టీమిండియాను.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆదుకున్నాడు. అవసరమైన బంతులను బౌండరీలుగా మలుస్తూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అశ్విన్(9) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు.

ఆరు వికెట్ కోల్పోయిన టీమిండియా..

టీమిండియా కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ పట్టు బిగించింది. బెస్ బౌలింగ్‌లో సుందర్ డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది.

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన పంత్(11).. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్వల్ప పరుగులకు ఔట్ అయ్యాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

100 పరుగులు దాటిన టీమిండియా..

టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 100 దాటింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(16), పంత్(6) ఉన్నారు. ఐదో రోజు మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతోంది. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 104/4 పరుగులు చేసింది.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

ఐదో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ కాన్ఫిడెంట్‌గా ఆటను మొదలుపెట్టినా.. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. భారత్‌ను కష్టాలలోకి నెట్టాడు. క్రీజులో కుదురుకున్న గిల్(50)ను అద్భుత బంతికి బౌల్డ్ చేయడమే కాకుండా అప్పుడే వచ్చిన వైస్ కెప్టెన్ రహనేను కూడా క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

రహనే డకౌట్..

మరోసారి రహనే నిరాశపరిచాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, పంత్ ఉండగా.. ఆశలన్నీ కూడా కెప్టెన్ పైనే పెట్టుకున్నారు.

హాఫ్ సెంచరీ సాధించి.. ఔట్ అయిన గిల్..

టీమిండియా ఓపెనర్ గిల్(50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. టెస్టు గెలవాలంటే ఇంకా భారీ టార్గెట్ చేధించాల్సి ఉంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

ఐదో రోజు ఆట మొదలైంది. ఇక ఆదిలోనే టీమిండియాను ఇంగ్లాండ్ దెబ్బ తీసింది. లీచ్ బౌలింగ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు 241 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ను.. అశ్విన్ బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రూట్(40) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2021 01:25 PM (IST)

    టీమిండియా ఆలౌట్..

    చివరి వికెట్ గా ఇషాంత్ పెవిలియన్ చేరడంతో ఇండియా 192 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో నాలుగు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.

  • 09 Feb 2021 01:18 PM (IST)

    కోహ్లీ ఔట్.. టీమిండియా ఆశలు గల్లంతు..

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీనితో భారత్ విజయ అవకాశాలు దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు. ఇంకా విజయం కోసం టీమిండియా 241 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లాండ్‌కు మరో రెండు వికెట్లు వస్తే చాలు..

  • 09 Feb 2021 01:09 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. లీచ్ బౌలింగ్‌లో అశ్విన్(9) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 171 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది.

  • 09 Feb 2021 12:55 PM (IST)

    50 ఓవర్లకు టీమిండియా 169/6..

    టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ(62*) ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చక్కదిడ్డుతూ.. అశ్విన్(9)తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

  • 09 Feb 2021 12:36 PM (IST)

    వైసీపీ, కాంగ్రెస్‌ వర్గాల వాగ్వాదం.. మహిళ ఫిర్యాదు

    కర్నూలు జిల్లా గోస్పాడు మండలం.. కానాలపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదాన్ని అడ్డుకోబోగా.. తనపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ వర్గీయులపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • 09 Feb 2021 12:34 PM (IST)

    కోహ్లీ అర్ధ సెంచరీ.. గెలవాలంటే ఇంకా 250 పైచిలుక పరుగులు అవసరం..

    సెకండ్ ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్న టీమిండియాను.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆదుకున్నాడు. అవసరమైన బంతులను బౌండరీలుగా మలుస్తూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అశ్విన్(9) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు.

  • 09 Feb 2021 11:04 AM (IST)

    ఆరు వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ పట్టు బిగించింది. బెస్ బౌలింగ్‌లో సుందర్ డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది.

  • 09 Feb 2021 10:57 AM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన పంత్(11).. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్వల్ప పరుగులకు ఔట్ అయ్యాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 09 Feb 2021 10:47 AM (IST)

    100 పరుగులు దాటిన టీమిండియా..

    టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 100 దాటింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(16), పంత్(6) ఉన్నారు. ఐదో రోజు మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతోంది. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 104/4 పరుగులు చేసింది.

  • 09 Feb 2021 10:43 AM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

    ఐదో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ కాన్ఫిడెంట్‌గా ఆటను మొదలుపెట్టినా.. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. భారత్‌ను కష్టాలలోకి నెట్టాడు. క్రీజులో కుదురుకున్న గిల్(50)ను అద్భుత బంతికి బౌల్డ్ చేయడమే కాకుండా అప్పుడే వచ్చిన వైస్ కెప్టెన్ రహనేను కూడా క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

  • 09 Feb 2021 10:37 AM (IST)

    రహనే డకౌట్..

    మరోసారి రహనే నిరాశపరిచాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, పంత్ ఉండగా.. ఆశలన్నీ కూడా కెప్టెన్ పైనే పెట్టుకున్నారు.

  • 09 Feb 2021 10:33 AM (IST)

    హాఫ్ సెంచరీ సాధించి.. ఔట్ అయిన గిల్..

    టీమిండియా ఓపెనర్ గిల్(50) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనితో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. టెస్టు గెలవాలంటే ఇంకా భారీ టార్గెట్ చేధించాల్సి ఉంది.

  • 09 Feb 2021 10:14 AM (IST)

    సిక్స్ కొట్టిన శుభ్‌మాన్ గిల్..

    బెస్ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్ భారీ సిక్స్ కొట్టాడు. స్పిన్నర్ సెటిల్ కాకుండా హిట్టింగ్ చేస్తూ.. స్కోర్ బోర్డును గిల్ ముందుకు నడిపిస్తున్నాడు. అటు కోహ్లీ సహకారాన్ని అందిస్తున్నాడు.

  • 09 Feb 2021 10:12 AM (IST)

    జోరు మీదున్న శుభ్‌మాన్ గిల్..

    శుభ్‌మాన్ గిల్ జోరు మీదున్నాడు. బెస్ బౌలింగ్‌లో చక్కటైన కవర్స్ మీదుగా రెండు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం క్రీజులో గిల్(35), కోహ్లి(1)తో ఉన్నారు.

  • 09 Feb 2021 10:10 AM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

Follow us on