Under-19 Asia cup: రద్దైన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్.. సెమీ‎ఫైనల్లో బంగ్లాతో తలపడనున్న భారత్..

|

Dec 28, 2021 | 7:53 PM

అండర్-19 ఆసియా కప్‌లో మంగళవారం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన  గ్రూప్ మ్యాచ్ మధ్యలోనే రద్దు అయింది...

Under-19 Asia cup: రద్దైన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్.. సెమీ‎ఫైనల్లో బంగ్లాతో తలపడనున్న భారత్..
Under 19
Follow us on

అండర్-19 ఆసియా కప్‌లో మంగళవారం బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన  గ్రూప్ మ్యాచ్ మధ్యలోనే రద్దు అయింది. ఇద్దరు అధికారులకు కరోనా సోకినట్లు గుర్తించడంతో మ్యాచ్ రద్దు చేశారు. అయితే బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ డిసెంబర్ 30న జరిగే సెమీ-ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. రెండో సెమీఫైనల్‌లో 30న పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడనుంది. జనవరి 1న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్‌-ఎలో పాకిస్థాన్‌ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. పాక్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. భారత్ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‎లో ఇండియా ఓడిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఫైనల్‌లో భారత్, పాక్ తలపడే అవకాశం ఉంది.

గ్రూప్ B చివరి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన బంగ్లాదేశ్‌ 32.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 130 పరుగులు చేసింది. అయితే ఇద్దరు అధికారుల పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఆసియా కప్‌లో భారత్‌ 2000, 2008, 2012, 2018లో నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. 2016లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

Read Also..  IND vs SA: పొరపాటు చేసిన రిషబ్ పంత్.. పుజారాకు తృటిలో తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..