బాల్ తగిలినా.. కింద పడని బెయిల్స్.. మిస్టరీ

| Edited By:

Jun 11, 2019 | 12:14 PM

ఆదివారం జరిగిన భారత్ – ఆసీస్ మ్యాచ్‌లో బంతి తాకినా బెయిల్స్ కిందపడకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు బూమ్రా వేసిన తొలి బంతికే ఔట్ కావాల్సి ఉంది. కానీ బెయిల్స్ కిందపడకపోవడంతో వార్నర్‌కు లైఫ్ దొరికింది. ఆసీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంతిని ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్.. డిఫెన్స్ ఆడబోయి బంతిని మిస్సయ్యాడు. బంతి వికెట్లను కాస్త బలంగానే తాకినట్లు రీప్లేలో కనిపించింది. కానీ బెయిల్స్ మాత్రం కిందపడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు. […]

బాల్ తగిలినా.. కింద పడని బెయిల్స్.. మిస్టరీ
Follow us on

ఆదివారం జరిగిన భారత్ – ఆసీస్ మ్యాచ్‌లో బంతి తాకినా బెయిల్స్ కిందపడకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు బూమ్రా వేసిన తొలి బంతికే ఔట్ కావాల్సి ఉంది. కానీ బెయిల్స్ కిందపడకపోవడంతో వార్నర్‌కు లైఫ్ దొరికింది.

ఆసీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంతిని ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్.. డిఫెన్స్ ఆడబోయి బంతిని మిస్సయ్యాడు. బంతి వికెట్లను కాస్త బలంగానే తాకినట్లు రీప్లేలో కనిపించింది. కానీ బెయిల్స్ మాత్రం కిందపడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దీనిపై తీవ్ర చర్చ.. రచ్చ నడుస్తోంది.