
India vs Australia Semifinal Score, Women’s ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 119, ఎల్లీస్ పెర్రీ 77, ఆష్లీ గార్డనర్ 63 పరుగులు చేశారు.
భారత్ తరఫున స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌర్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా రనౌట్ అయ్యారు. ఈరోజు జరిగే సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, క్రాంతి గౌర్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, మేగాన్ షుట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..