India Vs Australia: నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, అతను ఫీల్డింగ్‌లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. 3 క్యాచ్‌లను వదిలేశాడు. దీంతో ప్రస్తుతం అంతా కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, కోహ్లీ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నా లేదా సింపుల్ క్యాచ్‌ను వదులుకున్నా, లేదా వికెట్‌ను సాధించిన వేడుకలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి ఇలాంటిదే జరిగింది. డ్యాన్స్‌తో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాడు. ఇటీవలి బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ పఠాన్ నుంచి షారుఖ్ ఖాన్ స్టైల్ డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాగ్‌పూర్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సహకారం పెద్దగా లేదు. అతను 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 3 క్యాచ్‌లు వదిలేశాడు. రెండు క్యాచ్‌లు అందుకున్నాడు.
That’s Kohli ?… nothing Do in game But he give his moves So can Add A movement #jhum #ViratKohli? #Pathaan #INDvsAUS #BorderGavaskarTrophy2023 movement pic.twitter.com/5BuTrjstMp
— Sartaj ?? (@i_amSartaj) February 11, 2023
ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానున్న తరుణంలో టీమిండియా మైదానంలోకి దిగేందుకు వేచి చూసి బౌండరీకిచేరువలో నిల్చుంది. ఆ తర్వాత ఒక్కసారిగా విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో మాట్లాడుతున్నప్పుడు, కోహ్లీ షారూఖ్ ఖాన్ సూపర్‌హిట్ చిత్రం పఠాన్‌లోని ‘ఝూమే జో పఠాన్’ పాటలోని డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. అతడిని చూసి జడేజా కూడా ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.
కోహ్లీ ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది కోహ్లీ అంటూ రాసుకొచ్చాడు. మ్యాచ్‌లో ఏమీ చేయకపోవచ్చు. కానీ, తన స్టైల్‌తో కొన్ని క్షణాలు అభిమానులను ఎంటర్టైన్ చేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..