AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS Final: అంతటా క్రికెట్ ఫీవరే.. దారులన్నీ మోదీ స్టేడియం వైపే.. అహ్మదాబాద్‌లో ఆకాశాన్నంటిన ధరలు..

IND Vs AUS WC Final: Ticket, Hotel Prices Hikes : ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి మరి కొద్దిగంటలే మిగిలింది. సమవుజ్జీల సమరంవైపు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. వరుస విజయాలతో ఫైనల్స్‌లో దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి.అయితే ఆసీస్‌తో అంత ఈజీకాదు. మనళ్లూ అంత ఈజీగా మ్యాచ్‌ని చేజారనివ్వరు.

IND vs AUS Final: అంతటా క్రికెట్ ఫీవరే.. దారులన్నీ మోదీ స్టేడియం వైపే.. అహ్మదాబాద్‌లో ఆకాశాన్నంటిన ధరలు..
India Vs Australia
Shaik Madar Saheb
|

Updated on: Nov 19, 2023 | 9:34 AM

Share

IND Vs AUS WC Final: Ticket, Hotel Prices Hikes : ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి మరి కొద్దిగంటలే మిగిలింది. సమవుజ్జీల సమరంవైపు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. వరుస విజయాలతో ఫైనల్స్‌లో దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి.అయితే ఆసీస్‌తో అంత ఈజీకాదు. మనళ్లూ అంత ఈజీగా మ్యాచ్‌ని చేజారనివ్వరు. మరి ఈరోజు మ్యాచ్‌ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. భారత్, ఆసీస్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర అన్ని రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగల సీజన్, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోకి భారీగా రద్దీ నెలకొంది. అంతేకాదు.. నగరంలో విమాన ఛార్జీలు, హోటల్ టారిఫ్‌లు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కి విమానంలో ప్రయాణించడానికి చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ సాధారణంగా రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్ ప్రకారం.. నవంబర్ 18 నుంచి 20 మధ్య తేదీల్లో ఈ విమాన ఛార్జీలు 300శాతం పెంపుతో వరుసగా రూ. 31వేల నుంచి రూ. 43వేలు వరకు పెరిగాయి. ఇతర నగరాల నుంచి విమాన ఛార్జీలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే.. కనీసం 150 నుంచి 200 శాతం పెరిగాయి.

ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2003లో ప్రపంచకప్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పరిస్థితి, ఇప్పటి పరిస్థితి పోల్చి చూసుకుంటే అప్పుడు ఆస్ట్రేలియా ఉన్న స్థితిలో ఇప్పుడు ఇండియా ఉన్నందున కచ్చితంగా కప్ మనదే అంటున్నారు.

వీడియో చూడండి..

ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటిలు.. ఫైనల్ మ్యాచ్ కు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!