IND Vs AUS: సిరీస్‌పై గురి.. తుది జట్టులో కోహ్లీ ఫ్రెండ్‌కు నో ప్లేస్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

|

Mar 01, 2023 | 8:07 AM

Border- Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా జరుగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా..

IND Vs AUS: సిరీస్‌పై గురి.. తుది జట్టులో కోహ్లీ ఫ్రెండ్‌కు నో ప్లేస్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
India Vs Australia
Follow us on

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా జరుగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు ఆస్ట్రేలియా అయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ గండం లేకుండా.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని సర్వశక్తులు ఒడ్డిస్తోంది.

అటు ఆస్ట్రేలియా జట్టుకు ఈ సిరీస్ ఏమాత్రం కలిసి రావట్లేదు. గాయాల కారణంగా హజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, రెన్‌షా, ఆస్టన్ అగర్ స్వదేశం వెళ్లిపోగా.. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ కూడా జట్టుకు అందుబాటులో లేడు. ఇక అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టనున్నాడు. ఇప్పటికే అతడు టీమిండియాను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయడమే కాకుండా.. స్ట్రాంగ్ ఎలెవన్‌ను బరిలోకి దింపనున్నాడు ఇందులో భాగంగానే టీంలోకి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తిరిగి రానుండగా.. వీరిరువురూ.. ముగ్గురు స్పిన్నర్లతో తుది జట్టులో కలవనున్నారు.

మరోవైపు టీమిండియా విషయానికొస్తే.. తుది జట్టులో ఒక్క మార్పు మినహా మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా మూడో టెస్ట్‌కు రిపీట్ కానున్నారు. ఓపెనర్ కెఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి.. అతడి స్థానంలో శుభ్‌మాన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే రెండో టెస్ట్ పూర్తయిన అనంతరం.. అటు కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇద్దరూ రాహుల్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తామని అనడంతో.. సేమ్ టీం మళ్లీ ఇండోర్‌లోనూ బరిలోకి దిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా జట్టు (అంచనా):

ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నాస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచిల్ స్టార్క్, నాథన్ లియాన్, టోడ్ ముర్ఫి/లాన్స్ మోరిస్/స్కాట్ బొలాండ్, మాథ్యూ కుహ్నెమెన్‌, మాథ్యూ స్వీప్సన్

భారత్(అంచనా):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్/కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..