టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనుండటంతో.. అతడి స్థానాన్ని ఎవరి భర్తీ చేస్తారన్న చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ అంటుంటే.. మరికొందరు కెఎల్ రాహుల్ అని.. ఇంకొందరు రిషబ్ పంత్ అని.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు Inside Sport అనే జాతీయ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ”ఇందులో రహస్యం ఏం లేదు. లీడర్‌షిప్ రేసులో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. ప్రపంచకప్ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా గొప్ప రికార్డు ఉందని చెప్పాలి. ముంబై ఇండియన్స్ టీంకు సారధ్యం వహిస్తున్న రోహిత్.. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా రెండుసార్లు ట్రోఫీ దక్కించుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ.. టీమిండియా తరపున టెస్టులు, వన్డేలకు సారధిగా వ్యవహరించనున్నాడు.
Also Read: