Stuart Broad: అప్పుడు టీం ఇండియాకు మద్దతు పలికాం.. కానీ ఇప్పుడు శత్రువుగా భావిస్తాం.. ఎందుకో తెలుసా..

|

Feb 01, 2021 | 6:16 AM

Stuart Broad Coments: గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆసీస్‌పై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు.

Stuart Broad: అప్పుడు టీం ఇండియాకు మద్దతు పలికాం.. కానీ ఇప్పుడు శత్రువుగా భావిస్తాం.. ఎందుకో తెలుసా..
Follow us on

Stuart Broad Coments: గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆసీస్‌పై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. కానీ భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు టీం ఇండియాను శత్రువులాగే భావిస్తామని చెబుతున్నాడు. ఈ సందర్భంగా భారత పర్యటన గురించి బ్రాడ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉందని అయితే గబ్బా టెస్టులో భారత్‌కే మా జట్టు మద్దతు ఇచ్చిందని గుర్తుచేశాడు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించిందని కొనియాడాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన అగ్రస్థానంలో ఉండటానికి కారణమిదే అన్నాడు. రెండు వారాల క్రితం వాళ్ల ప్రదర్శనను అభిమానించిన మేమే ఇప్పుడు శత్రువులుగా భావించాల్సి వస్తోందని వెల్లడించాడు. అయితే మా బలాలతో మేం బరిలోకి దిగుతామని, మా వద్ద టాప్‌ ర్యాంకింగ్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారని చెప్పాడు. సానుకూల ధోరణితో పోరాడితే మేము తప్పకుండా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తన జీవితంలో చూసిన అద్భుత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీనేనని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. క్రికెట్‌లో పూర్తిగా మనసు పెట్టి ఆటగాడు కోహ్లీ అంటూ ప్రశంసించాడు.