Asia cup 2025: అక్షర్ పటేల్ గాయంపై కీలక అప్‌డేట్.. పాక్‌తో మ్యాచ్ ఆడడంపై కోచ్ ఏమన్నాడంటే?

Axar Patel Injury: ప్రస్తుత టోర్నమెంట్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తొలిసారి బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. అతను ఒకే ఒక ఓవర్ వేసి నాలుగు పరుగులు ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది ఓవర్లలో 188 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఒమన్ బలమైన సవాలు విసిరింది. కానీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

Asia cup 2025: అక్షర్ పటేల్ గాయంపై కీలక అప్‌డేట్.. పాక్‌తో మ్యాచ్ ఆడడంపై కోచ్ ఏమన్నాడంటే?
Ind Vs Pak Axar Patel Injury

Updated on: Sep 20, 2025 | 11:46 AM

Axar Patel Injury: ఆసియా కప్‌ 2025లో ఒమన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. తలకు బలంగా తగిలి మైదానం మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా పటేల్ గాయపడ్డాడు. మిడ్-ఆఫ్ నుంచి పరిగెత్తి శివం దుబే వేసిన బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాడు. అది హమ్మద్ మీర్జా బ్యాట్ అంచుకు తగిలింది.

పటేల్ బంతిని అందుకోగలిగాడు. కానీ, క్యాచ్‌ను మిస్ అయ్యాడు. ఎందుకంటే అది అతని చేతుల నుంచి జారిపోయింది. అతను ఆ ప్రయత్నంలో సమతుల్యతను కోల్పోయాడు. తల నేలపై గట్టిగా తగిలింది. ఆ తర్వాత అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు. భారత జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పటేల్ గాయం గురించి అప్‌డేట్ అందించాడు. మ్యాచ్ తర్వాత పటేల్ బాగానే ఉన్నట్లు అతను చెప్పాడు.

మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టి దిలీప్ మాట్లాడుతూ- ‘నేను ఇప్పుడే అక్షర్‌ని చూశాను, అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆ గాయం గురించి నేను చెప్పగలిగేది అంతే’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అక్షర్ దూకుడు బ్యాటింగ్..

ప్రస్తుత టోర్నమెంట్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తొలిసారి బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. అతను ఒకే ఒక ఓవర్ వేసి నాలుగు పరుగులు ఇచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది ఓవర్లలో 188 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఒమన్ బలమైన సవాలు విసిరింది. కానీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌తో, ఆసియా కప్ 2025 గ్రూప్ దశ ముగిసింది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తన మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..