IND vs PAK: సింపుల్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేసిన పాక్‌ బౌలర్‌..! ఇండియాతో మ్యాచ్‌ అంటే మజాక్‌ కాదు బ్రో..

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్‌ను 127 పరుగులకు కట్టడి చేసిన తర్వాత, భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. అయితే, పాకిస్థాన్ బౌలర్ మొహమ్మద్ నవాజ్ తిలక్ వర్మ ఇచ్చిన సింపుల్ క్యాచ్ డ్రాప్ చేయడం గమనార్హం.

IND vs PAK: సింపుల్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేసిన పాక్‌ బౌలర్‌..! ఇండియాతో మ్యాచ్‌ అంటే మజాక్‌ కాదు బ్రో..
Nawaz Dropped Catch

Updated on: Sep 15, 2025 | 12:09 AM

ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ వన్‌ సైడ్‌గా సాగుతోంది. తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌ పాకిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పాకిస్థాన్‌ను కేవలం 127 పరుగులకే టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పాక్‌ బౌలర్లను వణికించాడు. మొత్తంగా టీమిండియా చాలా కంఫర్ట్‌బుల్‌గా విజయం దిశగా సాగుతోంది. అయితే.. ఈ క్రమంలో ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఎంత ప్రజర్‌ ఉంటుందో చెప్పే ఓ ఘటన చోటు చేసుకుంది.

అదేంటంటే.. టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఇచ్చిన సింపుల్‌ క్యాచ్‌ను పాకిస్థాన్‌ బౌలర్‌ మొహమ్మద్‌ నవాజ్‌ నేలపాలు చేశాడు. నిజానికి అది చాలా సింపుల్‌ క్యాచ్‌. తిలక్‌ వర్మ స్ట్రేయిట్‌గా ఆడిన టచ్‌ షాట్‌ను పట్టుకోవడంలో నవాజ్‌ విఫలం అయ్యాడు. కాట్‌ అండ్‌ బౌల్‌గా తిలక్‌ పెవిలియన్‌ చేరేవాడు. కానీ.. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్‌ ఆ క్యాచ్‌ను అందుకోవడంలో తడబడ్డాడు. వికెట్‌ వచ్చేసిందని పాక్‌ ఆటగాళ్లు అనుకున్నారు కానీ, బంగారం లాంటి క్యాచ్‌ చేజారింది. మొత్తంగా తిలక్‌కు ఒక లైఫ్‌ వచ్చినా.. ఎక్కువ సేపు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 31 పరుగులు చేసిన ఆ తర్వాత ఓవర్‌లోనే అవుట్‌ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..