కోల్‌కత్తాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20(T20) మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యాకుమార్ యాదవ్(suryakumar yadav) 31 బంతుల్లో 65 పరుగులే చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉంది. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 34, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 7, రుత్‌రాజ్ 4 పరుగులు సాధించారు. హోల్డర్, షేపర్డ్, చెస్, వాల్ష్ , డ్రకెస్ ఒక్కో వికెట్ తీశారు.
185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వికెట్లు కోల్పోతున్నా నికోలస్ పూరన్ మాత్రం దాటిగా ఆడాడు. 47 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. చివర్లో షేఫర్డ్29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేలే మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, షర్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.