
IND vs NZ Highlights, Champions Trophy 2025 Final: 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 9 నెలల్లో రెండవ ట్రోఫీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత, రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 9వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, అద్భుతమైన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ బలమైన ఇన్నింగ్స్ సహాయంతో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో, 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు, అతను ఈ ట్రోఫీని గరిష్టంగా గెలుచుకున్న రికార్డును కూడా భారత్ సృష్టించింది.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
45 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాహుల్, హార్దిక్ పాండ్యా మైదానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇద్దరినీ సాంట్నర్ అవుట్ చేశాడు.
38.4 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ మైదానంలో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేసి ఔటయ్యాడు.
37 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.
26.1 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
భారత జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత గిల్, ఆ తర్వాత కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
సెంచరీ భాగస్వామ్యం తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. గ్లెన్ ఫిలిఫ్స్ అధ్బుతమైన క్యాచ్‌తో గిల్ (31) ఔట్ అయ్యాడు.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 17వ ఓవర్‌లో సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. సాంట్నర్ వేసిన చివరి బంతికి గిల్ సింగిల్ తీసి, ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 100 పరుగులకు చేర్చాడు.
రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నమెంట్‌లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 31 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 21, గిల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2 ఓవర్లలో భారత జట్టు 22 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నారు. రోహిత్ సిక్స్ తో భారత జట్టు ఖాతా తెరిచాడు.
252 పరుగుల టార్గెట్‌తో భారత జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రోహిత్ వర్మ, శుభ్మన్ గిల్ వచ్చారు. తొలి ఓవర్ 2వ బంతికే సిక్స్ కొట్టిన రోహిత్.. భారత పరుగుల ఖాతాను ఓపెన్ చేశాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. దీంతో భారత జట్టుకు 252 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.
46వ ఓవర్లో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్ 63 పరుగులు చేసి ఔటయ్యాడు. షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
42వ ఓవర్లో డారిల్ మిచెల్ తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 91 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది డారిల్ మిచెల్ కు 8వ అర్ధశతకం.
వరుణ్ చక్రవర్తి తన అద్భుత బంతితో గ్లెన్ ఫిలిఫ్స్ (34) ను బౌల్డ్ చేశాడు. దీంతో డారిల్ మిచెల్‌తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు వరుణ్. దీంతో ప్రస్తుతం కివీస్ జట్టు 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
37వ ఓవర్లో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ 5వ వికెట్‌కు యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, న్యూజిలాండ్ జట్టు 108 పరుగుల వద్ద టామ్ లాథమ్ వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
33 ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో ఉన్నారు.
24వ ఓవర్లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను రవీంద్ర జడేజా చేతిలో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో కూడా జడేజా చేతికి చిక్కడం గమనార్హం.
22 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 3 వికెట్లకు 104 పరుగులు. డారిల్ మిచెల్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.
260 – రచిన్ రవీంద్ర (86.67 సగటు)
227 – బెన్ డకెట్ (75.67 సగటు)
225 – జో రూట్ (75 సగటు)
217* – విరాట్ కోహ్లీ (72.33 సగటు)
216 – ఇబ్రహీం జాద్రాన్ (సగటున 72)
కేన్ విలియమ్సన్ (11) సింపుల్ షాట్ ఆడే క్రమంలో కుల్దీప్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ జట్టు 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది.
కుల్దీప్ తన తొలి ఓవర్లోనే భారత జట్టుకు డేంజరస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ జట్టు 10.1 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది.
ఇప్పటికే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న భారత్‌కు వరుణ్ చక్రవర్తి భారీ ఊరటనిచ్చాడు. విల్ యంగ్ (15)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు.
బౌలింగ్ చేస్తున్న సమయంలో షమీ రివర్స క్యాచ్ పట్టేందుక ట్రై చేశాడు. దీంతో బాల్ చేతికి తగిలి గాయమైంది. తన ఓవర్ పూర్తి చేసిన వెంటనే పెవిలియన్ చేరాడు.
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో, హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర 3 బౌండరీలు బాదాడు. వీటిలో 2 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. హార్దిక్ వేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను మొదటి బంతిని వైడ్ గా బౌలింగ్ చేయగా, రచిన్ రవీంద్ర ఓ పరుగుతో తన ఖాతా తెరిచాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ జట్టు ఐసీసీ టోర్నమెంట్‌లో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ ఆడుతోంది. ఆస్ట్రేలియా 13 ఫైనల్స్ ఆడింది.
వన్డేల్లో భారత్ వరుసగా 15 సార్లు టాస్ ఓడిపోయింది. ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 12వ సారి టాస్ ఓడిపోయాడు.
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్.
కీలక మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ నెగ్గాలని దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. సూపర్ సండేరోజు నెగ్గాలని చూస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ సజావుగా సాగాలని.. మనోళ్లు విజయం సాధించి కప్పుతో తిరిగి దేశంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.
దుబాయ్‌లో ధూంధాంకి అంతా సిద్ధమైంది. ఇండియా, న్యూజిలాండ్ గ్రాండ్ ఫినాలే మధ్యాహ్నం 2.30కి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ తర్వాత… రోహిత్ శర్మ, కోహ్లీ భవితవ్యంపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ముఖ్యంగా టోర్నీ రిజల్ట్ ఎలా ఉన్నా.. రోహిత్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
టీం ఇండియా రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. టీం ఇండియా చివరిసారిగా 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశానికి తీసుకువచ్చింది. 2017లో అయితే, ఫైనల్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో భారత ఆటగాళ్లకు 12 సంవత్సరాల తర్వాత ఈ ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ మధ్య 119 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ కాలంలో, భారతదేశం 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, 7 మ్యాచ్‌లు అసంపూర్తిగా ముగిశాయి. 1 మ్యాచ్ టై అయింది.
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, కైల్ జామిసన్, విల్ ఓ’రూర్కే, జాకబ్ డఫీ.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.
అక్యూవెదర్ నివేదిక ప్రకారం, దుబాయ్‌లో ఈరోజు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండవచ్చు. ఇది కాకుండా, వర్షం పడే అవకాశం 10 శాతం వరకు ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం ఒక రిజర్వ్ డే కూడా ఉంచారు.
ఇప్పటివరకు చూసినట్లుగా, ఈ మ్యాచ్‌లో ఉపయోగించబోయే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో, దుబాయ్‌లో 4 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లన్నీ తక్కువ స్కోరింగ్‌గా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు వీలైనన్ని ఎక్కువ మంది స్పిన్నర్లతో మైదానంలోకి ప్రవేశించాలని కోరుకుంటాయి.
25 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అంతకుముందు, ఈ రెండు జట్లు 2000 సంవత్సరంలో తలపడ్డాయి. అప్పుడు న్యూజిలాండ్ జట్టు గెలిచి టైటిల్ గెలుచుకుంది.
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డఫీ.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. రెండు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడతాయి. మ్యాచ్ టాస్ మధ్యాహ్నం 2:00 గంటలకు జరుగుతుంది. ఆట మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.