IND vs ZIM, 3rd T20I: మూడో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం..

|

Jul 10, 2024 | 8:07 PM

IND vs ZIM, 3rd T20I Result: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జులై 13న జరగనుంది.

IND vs ZIM, 3rd T20I: మూడో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం..
Ind Vs Zim 3rd T20i Result
Follow us on

IND vs ZIM, 3rd T20I Result: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జులై 13న జరగనుంది.

హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఇక్కడ నుంచి డియోన్ మైయర్స్ 49 బంతుల్లో 65 పరుగులతో అజేయ అర్ధ సెంచరీ ఆడాడు. క్లైవ్ మదాండేతో కలిసి ఆరో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఆశలు పెంచారు. కానీ, అతని జట్టును గెలిపించలేకపోయాడు. భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.

భారత జట్టు తరపున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లో 66 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్‌లో గిల్ తొలి అర్ధశతకం సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. యశస్వి జైస్వాల్ 36 పరుగులు చేశాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..