Yuzvendra Chahal: టీ20 ఫార్మెట్‌లో చాహాల్‌కు సువర్ణవకాశం.. ఒక్క వికెట్ తీస్తే చాలు ఆ ఘనత సాధించినట్లే..

|

Feb 20, 2022 | 1:24 PM

IND vs WI: రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీంఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో కరీబియన్ జట్టును వైట్‌వాష్ చేసిన భారత్..

Yuzvendra Chahal: టీ20 ఫార్మెట్‌లో చాహాల్‌కు సువర్ణవకాశం.. ఒక్క వికెట్ తీస్తే చాలు ఆ ఘనత సాధించినట్లే..
Yuzvendra Chahal
Follow us on

IND vs WI: రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీంఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో కరీబియన్ జట్టును వైట్‌వాష్ చేసిన భారత్.. టీ20 ఫార్మెట్‌లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు (Yuzvendra Chahal) మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. మూడో విజయాన్ని కూడా దక్కించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ టీ20 ల్లో రికార్డును సృష్టించేందుకు ఒక వికెట్‌ దూరంలో ఉన్నాడు. టీ20 ఫార్మెట్‌లో వికెట్‌ పడగొడితే ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా (66 వికెట్లు 55 మ్యాచ్‌ల్లో), చాహల్‌ (66 వికెట్లు 52 మ్యాచ్‌ల్లో) సమానంగా ఉన్నారు. అయితే.. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియా – వెస్టిండీస్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ (IND vs WI) లో చాహల్‌ ఒక్కవికెట్‌ పడగొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు. అయితే.. ఈ సిరీస్‌లో బుమ్రా ఆడటం లేదు. దీంతో చాహాల్‌కు ఈ అరుదైన ఘనత సాధించేందుకు అవకాశం లభించినట్లయింది. అయితే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ మూడో టీ20లో యుజ్వేంద్ర చాహల్ వికెట్ తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడని పేర్కొంటున్నారు.

మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌.. 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. టీ20 సిరీస్ లోనూ భారత్ అదే జోరు కొనసాగిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు గెలిచి సిరీజ్ చేజిక్కించుకున్న టీంఇండియా.. మూడో మ్యాచ్ కూడా గెలుపొంది విండీస్‌ను మరోసారి వైట్‌వాష్‌ చేయాలని తహతహలాడుతోంది.

Also Read:

IND vs SL: రంజీలో పరుగులు, వికెట్లు తీస్తేనే జట్టులోకి రీఎంట్రీ.. నలుగురు సీనియర్‌ ప్లేయర్లకు సెలక్టర్ల సందేశం..

Ind vs SL: ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ.. మా వ్యూహంలో భాగమేనన్న చీఫ్ సెలక్టర్..