Video: తొలి హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. డ్యాన్స్‌తో ఇరగదీసిన తెలుగబ్బాయి.. ఆ సెలబ్రేషన్స్ ఎవరికోసమో తెలుసా?

|

Aug 07, 2023 | 3:20 PM

Tilak Varma Half Century Dance: ఫిఫ్టీ పూర్తి చేస్తున్న సమయంలో డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, హాఫ్ సెంచరీ సమయంలో ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి కారణం చాలా స్పెషల్‌గా మారింది. రోహిత్ శర్మ కుమార్తె ఇందులో ఇన్వాల్వ్ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Video: తొలి హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. డ్యాన్స్‌తో ఇరగదీసిన తెలుగబ్బాయి.. ఆ సెలబ్రేషన్స్ ఎవరికోసమో తెలుసా?
Tilak Varma Half Century Da
Follow us on

Tilak Varma Half Century Dance: వెస్టిండీస్ టూర్ భారత క్రికెట్ జట్టుకు హెచ్చు తగ్గులతో నిండిపోయింది. టెస్టు సిరీస్‌లో సులువుగా విజయం సాధించగా, వన్డేల్లో కాస్త కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం టీ20లో హార్దిక్ సేన పరిస్థితి మరింత దిగజారిపోయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇదిలావుండగా, మూడు ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్ల రూపంలో టీమిండియాకు శుభవార్తలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ టెస్టులో అరంగేట్రం చేయగా, ముఖేష్ కుమార్ వన్డేలో అరంగేట్రం చేశాడు. టీ20 సిరీస్‌ల్లో తెలుగబ్బాయి తిలక వర్మ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్‌ అరంగేట్రంలోనే తొలి రెండు మ్యాచ్‌ల్లో పటిష్ట బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ.. ఫ్యూచర్ స్టార్‌గా ఆశలు నింపుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో తిలక్ తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇక్కడ అతను ఫిఫ్టీ పూర్తి చేస్తున్న సమయంలో డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, హాఫ్ సెంచరీ సమయంలో ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి కారణం చాలా స్పెషల్‌గా మారింది. రోహిత్ శర్మ కుమార్తె ఇందులో ఇన్వాల్వ్ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

20 ఏళ్ల తిలక్ వర్మ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసి జట్టు తరపున అత్యధికంగా 39 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ఆ ఇన్నింగ్స్ మరుగున పడిపోయింది. రెండో మ్యాచ్‌లో తిలక్ తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుని తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. తిలక్ 51 పరుగులు చేశాడు. అయితే, అతను మినహా, జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. ఇంతటి ఇన్నింగ్స్ ఆడినా.. భారత్ పరాజయం పాలైంది.

రోహిత్ కూతురు కోసం తిలక్ డ్యాన్స్..

మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ తిలక్ వర్మ ఈ మ్యాచ్‌ని తనకు గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా కోసం గుర్తుండిపోయేలా చేశాడు. ఈ యువ బ్యాట్స్‌మన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 39 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. యాభై పూర్తి చేసిన వెంటనే తిలక్ తన రెండు బొటనవేళ్లను పైకెత్తి కొన్ని సెకన్ల పాటు స్పెషల్ డ్యాన్స్ చేశాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో తిలక్‌ను ఈ ప్రశ్న అడిగారు. అందుకు సమాధానం చెబుతూ.. తాను ఎప్పుడూ రోహిత్ కుమార్తెతో ఆడుకుంటానని, ఇదే తరహాలో ఇద్దరం డ్యాన్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా ఇలాగే సంబరాలు చేసుకుంటానని సమైరాకు మాట ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ముంబైలో కీలక విషయాలు..

ఐపీఎల్‌లో రోహిత్ కెప్టెన్సీలో తిలక్ వర్మ కీలక విషయాలు నేర్చుకున్నాడు. ముంబై 2022 మెగా వేలంలోనే తిలక్‌ను కొనుగోలు చేసింది. రెండు సీజన్లలో, తిలక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబై బ్యాటింగ్‌లో తన స్థానాన్ని ధృవీకరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..