
R Ashwin Records: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) మొత్తం 12 వికెట్లు పడగొట్టి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అది కూడా టీమిండియా తరపున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.
ఇంతకు ముందు ఈ స్థానాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆక్రమించాడు. భజ్జీ 365 మ్యాచుల్లో మొత్తం 707 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ కేవలం 271 మ్యాచ్‌ల్లోనే 709 వికెట్లు తీసి హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరపున మొత్తం 401 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే 953 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే అని చెప్పొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..