Sachin Tendulkar: 1000 వన్డేల ప్రయాణం అంత ఈజీ కాదు.. ఇందులో ఆ 5 ఇన్నింగ్స్‌లే వెరీ వెరీ స్పెషల్: సచిన్

|

Feb 05, 2022 | 4:23 PM

IND vs WI: సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 467 వన్డేల్లో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే ఈ ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రమే తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం అంటూ సచిన చెప్పుకొచ్చాడు.

Sachin Tendulkar: 1000 వన్డేల ప్రయాణం అంత ఈజీ కాదు.. ఇందులో ఆ 5 ఇన్నింగ్స్‌లే వెరీ వెరీ స్పెషల్: సచిన్
Sachin (4)
Follow us on

Indian Cricket Team: ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా(IND VS WI) 1000వ వన్డే ఆడనుంది. భారత మాజీ కెప్టెన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లను, భారత క్రికెట్(Team India) నిర్వాహకులను అభినందించాడు. ప్రతీ ఒక్కరి సహాయంతోనే ఈ ప్రయాణం సాధ్యమైంది. 1996 ప్రపంచకప్ తర్వాత వన్డే విప్లవం వచ్చిందని సచిన్ తెలిపాడు. అలాగే తన వన్డే కెరీర్‌లోని 5 ఇన్నింగ్స్‌లేవో కూడా పేర్కొన్నాడు.

2003 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై..
2003 ప్రపంచ కప్‌లో సెంచూరియన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టెండూల్కర్ తన ఐదు ఉత్తమ వన్డే ఇన్నింగ్స్‌లలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇది ఒత్తిడితో కూడిన మ్యాచ్ అని, అందుకే తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిందన్నాడు. సెంచూరియన్‌ ఇన్నింగ్స్‌ ప్రపంచకప్‌లో నా అత్యుత్తమ ప్రదర్శనగా నిలివడంతోపాటు పాక్‌పై విజయం సాధించడంలో కీలకంగా మారిందని అన్నారు.

ఇది కాకుండా, బ్రిస్టల్‌లో కెన్యాపై ప్రత్యేక ఇన్నింగ్స్‌లో సచిన్ సెంచరీని కూడా ప్రత్యేకమైందని తెలిపాడు. తన తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మరణించిన వెంటనే ఈ సెంచరీని సాధించడంతో ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకత ఉంది.

టెండూల్కర్ మాట్లాడుతూ, ‘నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మను చూసి భావోద్వేగానికి గురయ్యాను. మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె ఎంతో వేధనకు గురైంది. కానీ ఆ దుఃఖంలో కూడా, నేను ఇంట్లో ఉండకూడదనుకుంది. నేను జాతీయ జట్టుకు ఆడాలని కోరుకుంది. కెన్యాపై సెంచరీ సాధించినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’ అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు. 1999 ప్రపంచకప్‌లో కెన్యాపై సచిన్ 101 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

షార్జాలో ఆస్ట్రేలియాపై 1998 కోకా-కోలా కప్‌లో 134 బంతుల్లో 131 పరుగులు చేయడం కూడా తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిందని అన్నాడు. ఇదే సమయంలో 2010లో గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. సచిన్ 134 బంతుల్లో 200 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా చాలా మంచి బౌలింగ్‌ను కలిగి ఉందని, వన్డేల్లో ఎవరైనా డబుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి అని సచిన్ తన చిరస్మరణీయ ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు.

టెండూల్కర్ భారత్ తరఫున 200వ, 300వ, 400వ, 500వ, 600వ, 700వ, 800వ వన్డేల్లో ఆడాడు. కేవలం 100వ, 900వ వన్డే మ్యాచుల్లో ఆడలేదు. దీంతో టీమిండియాతో ఎక్కువ కాలం జర్నీచేసిన ప్లేయర్‌గా సచిన్ నిలిచాడు.

Also Read: IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..?

Team India: ఆ ఇద్దరి దిగ్గజాల వల్లే ఎంఎస్ ధోనీ కెప్టెన్ అయ్యాడు: టీమిండియా మాజీ మేనేజర్