మొహాలీలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెలరేగిపోయాడు. నాలుగేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో అతని బ్యాట్ సెంచరీ సాధించింది. టెస్టు క్రికెట్‌లో భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఇది రెండో సెంచరీ. మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్(Ind Vs SL)లో ఈ ఘనత సాధించాడు. జడేజా బ్యాటింగ్‌లో సెంచరీ బాదిన తర్వాత శ్రీలంకపై భారత్ భారీ స్కోరు సాధించేందుకు మార్గం సుగమం అయింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ జడేజా 2018లో వెస్టిండీస్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టులో తన మొదటి, చివరి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆ సమయంలో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
శ్రీలంకపై రవీంద్ర జడేజా 160 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు కొట్టాడు. సింగిల్‌తో టెస్టు క్రికెట్‌లో రెండో సెంచరీకి స్క్రిప్ట్ రాసుకుని, చక్కగా పూర్తి చేశాడు. అశ్విన్(61), జడేజా(99) ఏడో వికెట్‌కు 130 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. భారత్ వర్సెస్ శ్రీలంక టీంల మధ్య కూడా ఇదే అత్యధికం కావడం విశేషం. అయితే, ఆ తరువాత లక్మాల్ బౌలింగ్‌లో అశ్విన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 467 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది.
?@imjadeja brings up his 2nd Test CENTURY ??.
Live – https://t.co/XaUgORcj5O #INDvSL @Paytm pic.twitter.com/L4rYFhWLlM
— BCCI (@BCCI) March 5, 2022
IND vs SL, 1st Test: ఆ చెత్త రికార్డులో ధోని సరసన చేరిన రిషబ్ పంత్.. అదేంటంటే?
IND vs SL, 1st Test, Day 2, Live Score: భారీ స్కోర్ దిశగా భారత్.. సెంచరీ పూర్తి చేసిన జడేజా..