IND vs SL: “సెలవుల్లా ఫీలవుతారని జట్టులో ఎంపిక చేయలేదు.. అవకాశం వచ్చినప్పుడే సత్తా చాటాలి”

|

Jul 29, 2021 | 1:37 PM

రెండవ టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. కీలక ఆటగాళ్లు లేకుండా టీమిండియా ఐదుగురు నూతన బ్యాట్స్ మెన్లతో బరిలోకి దిగింది.

IND vs SL:  సెలవుల్లా ఫీలవుతారని జట్టులో ఎంపిక చేయలేదు.. అవకాశం వచ్చినప్పుడే సత్తా చాటాలి
Teamindia
Follow us on

IND vs SL: రెండవ టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. కీలక ఆటగాళ్లు లేకుండా టీమిండియా ఐదుగురు బ్యాట్స్ మెన్లతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. క్వారంటైన్ ప్రోటోకాల్ కారణంగా టీమిండియాకు చెందిన తొమ్మిది మంది ఆటగాళ్లు రెండవ టీ20 మ్యాచ్‌కు అందుబాటులో లేరు. ఐపీఎల్ స్టార్ ప్లేయర్స్ రితురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, నితీష్ రానా, చేతన్ సకారియాకు భారత జట్టులో స్థానం లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కొంత ఉత్కంఠ రేకేత్తినా.. లంక టీంనే విజయం వరించింది. కఠినమైన ఆర్. ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్స్ ఇబ్బందిపడ్డారు. టీ20 ఫార్మాట్‌కు విరుద్ధంగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే కొట్టారు. భారత్ ఇన్నింగ్స్‌లో 42 డాట్ బాల్స్ ఉన్నాయి.

కేవలం బెంచ్ మీద కూర్చోబెట్టేందుకే ఎంపిక చేయలేదు
ఈమేరకు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆయన ఆటగాళ్లతో మాట్లాడుతూ- “వన్డే సిరీస్ గెలిచిన తరువాత, గత మ్యాచ్‌ల్లో కొంతమంది ఆటగాళ్లకు అవకాశం కల్పించాం. అవకాశం వచ్చినప్పుడే సత్తా చూపాలి. లేదంటే తరువాత టీమిండియాలో స్థానం దొరకకపోవచ్చు. ప్రస్తుతం పరిస్థితుల్లో సిరీస్ గెలిచేందుకు అనువైన జట్టునే ఎంపిక చేశాం. టీమిండియా తరుపున ఎంపికైతే కేవలం బెంచ్‌కే పరిమితం కారు. మ్యాచ్ ఆడే ఎలెవన్ జట్టులో మీరు ఒకరిగానే భావించాలి. కేవలం బెంచ్ మీద లేదా సరదాగా గడిపేందుకు మిమ్మల్ని సెలక్టర్లు జట్టులోకి ఎంపికచేయలేదని” అన్నారు.

టీమిండియాకు ఎంపికవ్వడం అంత సులభం కాదు..
కొలంబో పిచ్‌లో టీమిండియా తరపును బరిలోకి దిగిన అరంగేట్ర ఆటగాళ్లు తమదైన ముద్ర వేయలేకోయారు. ఈమేరకు కొత్త ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ క్లాస్ పీకారు. “నేను జట్టు మొత్తాన్ని చూస్తున్నాను. ఇక్కడ ఉన్న 20 మంది, వారి పనితీరు కారణంగానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. టీమిండియా తరపున జట్టులో చోటు దక్కడం అంత సులభం కాదు. ఇక్కడ అవకాశం ఇచ్చినట్లు ప్రతిసారీ మేము మీకు అవకాశం అందించలే. అందుకే అవకాశం వచ్చినప్పుడే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలి” అంటూ హెచ్చరించారు.

Also Read: ఈ ఆటగాడి సూపర్ ఇన్నింగ్స్‌తో శ్రీలంకకు వణుకు పుట్టించాడు.. 304 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా

IND vs SL 3rd T20 Preview: నిర్ణయాత్మక టీ20లో విజయం ఎవరిదో..? నేడు మరో ఆటగాడు అరంగేట్రం చేసే ఛాన్స్..!