IND Vs SL: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో శిఖర్ సేన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా లోస్కోర్ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా.. చివరకు గెలుపు లంకనే వరించింది. అయితే, లంక ఇన్నింగ్స్‌లో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలా చిట్టిలో ఏం ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ సూచన మేరకు సందీప్ వారియర్ ఓ చిట్టీ పట్టుకుని మైదానంలోకి పరుగెత్తాడు. ఆ చిట్టీని తీసుకొని గ్రౌండ్‌లోకి వెళ్లి శిఖర్ ధావన్‌కు అందించాడు. ఆ చిట్టీలో ద్రవిడ్ ఏం పంపాడనేది అందరిలో ఆసక్తిని కలిగించింది. దీనిపై నెటిజన్లు కూడా అందులో ఏముందో తెలుసుకోవాలని ఆసక్తితో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఆ చిట్టీలో డక్‌వర్త్ లూయిస్ గురించిన స్కోర్‌ను పంపినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు వర్షం అడ్డుగతలడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందని భావించిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. అందుకు తగిన ప్రణాళికలను అందులో రాసి కెప్టెన్ శిఖర్ ధావన్‌కు పంపించాడు. కొద్దిసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ 40 (42 బంతుల్లో ; 5 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ 29 (23 బంతులు; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ 21 (18 బంతులు; 1 ఫోర్) పరుగులు సాధించారు. శ్రీలంక బౌలర్లలో అకిల ధనంజయ 2 వికెట్లు తీశాడు. 133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన శ్రీలంక టీం.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని సాధించింది. ధనంజయ డిసిల్వా 40 (34 బంతులు; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే12 (6 బంతులు 12 నాటౌట్; 1 సిక్స్) జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఈ రోజు మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచులో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ధనంజయ డిసిల్వా నిలిచాడు.