IND vs SL: రోహిత్ శర్మకు షాకిచ్చిన రిషబ్ పంత్.. ఆ స్పెషల్ రికార్డులో చేరిన టీమిండియా కీపర్

|

Mar 05, 2022 | 2:05 PM

మొహాలీ టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 పరుగులకు డిక్లెర్ చేసింది. ఈ సందర్భంగా రిషబ్ పంత్ పేరిట ఓ ప్రత్యేక రికార్డు నమోదైంది.

IND vs SL: రోహిత్ శర్మకు షాకిచ్చిన రిషబ్ పంత్.. ఆ స్పెషల్ రికార్డులో చేరిన టీమిండియా కీపర్
India Vs Sri Lanka Rishabh Pant
Follow us on

Rishabh Pant: మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక(Ind vs Sl) మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. దీంతో శ్రీలంక ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా(175 నాటౌట్)(Ravindra jadeja), రిషబ్ పంత్(96) కీలక పాత్ర పోషించారు. జడేజా అద్భుతంగా ఆడి 150+ స్కోర్ చేశాడు. కాగా పంత్ ఇన్నింగ్స్ 96 పరుగులతో ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

మొహాలీలో రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదేశాడు. ఈ సిక్సర్ల సాయంతో ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఆగస్టు 2018 నుంచి టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో పంత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో రోహిత్ శర్మను వెనక్కునెట్టాడు.

ఆగస్టు 2018 తర్వాత టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ స్టోక్స్ 43 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు రిషబ్ పంత్ 42 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 34 సిక్సర్లు కొట్టాడు. రిషబ్ టెస్టు మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసిన తర్వాత ఈ రికార్డు అతనికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఆగస్టు 2018లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 29 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 49 ఇన్నింగ్స్‌లలో 1831 పరుగులు చేశాడు. ఈ కాలంలో రిషబ్ 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను చాలాసార్లు 90ల్లో ఔటయ్యాడు.

Also Read: Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

IND vs SL: 4 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ.. రీ ఎంట్రీలో అదరగొట్టిన జడ్డూ.. భారీ స్కోర్ దిశగా భారత్..