IND vs SL, 1st Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం..

IND vs SL, 1st Test, Day 2 Highlights:మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు  ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్సింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

IND vs SL, 1st Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం..
India Vs Sri Lanka

Edited By:

Updated on: Mar 05, 2022 | 5:19 PM

మొహాలి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు  ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్సింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అశ్విన్ 2 వికెట్లు తీయగా, జడేజా, బుమ్రా తలా ఓ వికెట్ తీశారు. అంతకు ముందు భారత్  574 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.  రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రీలంక తరపున సురంగ లఖ్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా తలో రెండు వికెట్లు తీశారు.అశ్విన్‌ (61), షమీ (20) రాణించారు.   ప్రస్తుతం లంకేయులు ఇంకా  466 పరుగులు వెనకబడి ఉన్నారు.

ఇండియా ప్లేయింగ్ XI:  రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

శ్రీలంక ప్లేయింగ్ XI:  దిముత్ కరుణరత్నే, లహిరు తిరిమన్నె, పాతుమ్ నిసంక, చరిత్ అస్లాంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ్ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార

Key Events

మొహాలీ టెస్ట్, డే 1

మొహాలీ టెస్టులో తొలి రోజు భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. తొలిరోజు పంత్ 94, విరాట్ 45, విహారి 58 రన్స్ చేసి ఔటయ్యారు.

జడేజా, పంత్ మధ్య సెంచరీ భాగస్వామ్యం

రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ మధ్య ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొని ఉంది. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును 5 వికెట్ల నష్టానికి 228 నుంచి 6 వికెట్లకు 332కి తీసుకెళ్లారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Mar 2022 04:53 PM (IST)

    చిక్కుల్లో లంక.. నాలుగో వికెట్ డౌన్..

    టీమిండియా సాధించిన భారీస్కోరుకు శ్రీలంక సరైన సమాధానం ఇవ్వలేక పోతోంది. భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతోంది.  తాజాగా ధనంజయ డిసిల్వా (1) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం లంక స్కోరు 40 ఓవర్లలో 108/4.  నేటి ఆటలో ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • 05 Mar 2022 04:37 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన లంక.. బుమ్రాకు చిక్కిన మాథ్యూస్‌..

    శ్రీలంక జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న సీనియర్‌ బ్యాటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ (22) బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరోవైపు లంక స్కోరు వంద పరుగులు దాటింది. క్రీజులో నిశాంక (20), ధనంజయ డిసిల్వా (1) ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 36 ఓవర్లలో 101/3.


  • 05 Mar 2022 01:50 PM (IST)

    తొలి ఇన్నింగ్స్ డిక్లెర్ చేసిన భారత్..

    టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 547/8 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. ఇందులో రవీంద్ర జడేజా 175 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో శ్రీలంక ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది.

  • 05 Mar 2022 01:12 PM (IST)

    జడేజా 150 ఇన్నింగ్స్..

    కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న జడేజా.. సెంచరీ తర్వాత లంక బౌలర్లపై విశ్వరూపం చూపిస్తున్నాడు. 150 పరుగులతో దూసుకెళ్తున్నాడు. కేవలం 211 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 150 పరుగులు పూర్లి చేశాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసి, భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

  • 05 Mar 2022 11:30 AM (IST)

    జడేజా సెంచరీ ఇన్నింగ్స్..

    కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న జడేజా.. సెంచరీ పూర్తి చేశాడు. కేవలం160 బంతుల్లో 10 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 465 పరుగులు చేసి, భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

  • 05 Mar 2022 11:26 AM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    ఎట్టకేలకు శ్రీలంక టీం భారీ భాగస్వామ్యానికి బ్రేకులు వేసింది. అశ్విన్(61), జడేజా(99) 130 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. ఏడో వికెట్‌కు భారత్ వర్సెస్ శ్రీలంక టీంల మధ్య కూడా అత్యధికం కావడం విశేషం. అయితే, లక్మాల్ బౌలింగ్‌లో అశ్విన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 467 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది.

  • 05 Mar 2022 11:07 AM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన అశ్విన్..

    రెండో రోజు ఆట ప్రారంభించిన అశ్విన్(55), జడేజా(90) తమ ఉత్తమ ఆటతీరుతో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చేందుకు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అశ్విన్ 12వ టెస్ట్ అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 7 ఫోర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 106 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 447 పరుగులు చేసింది.

  • 05 Mar 2022 10:29 AM (IST)

    400 దాటిన టీమిండియా స్కోర్..

    టీమిండియా రెండో రోజు భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. రవీంద్ర జడేజా(77), అశ్విన్ (28) ధాటిగా ఆడుతుండడంతో భారత్ 98 ఓవర్లకే 400 పరుగులు దాటింది. భారత్ చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్లు మాత్రం వికెట్ల కోసం పడిగాపులు కాస్తు్న్నారు.

  • 05 Mar 2022 09:38 AM (IST)

    జడేజా అర్థసెంచరీ..

    రెండో రోజు ఆట మొదలు కాగానే రవీంద్ర జడేజా 4 ఫోర్ కొట్టి తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అశ్విన్, జడేజా మధ్య భాగస్వామ్యం 30 పరుగులకు చేరింది. టీమిండియా స్కోర్ 6 వికెట్లకు 363కు చేరింది.

  • 05 Mar 2022 08:14 AM (IST)

    700వ టెస్ట్ వికెట్ నమ్మశక్యం కానిది..

    ఆస్ట్రేలియా మాజీ కోచ్, జస్టిన్ లాంగర్.. వార్న్‌తో కలిసి ఆడుతున్నప్పుడు తన జ్ఞాపకాల గుర్తు చేసుకున్నాడు. “మొదటిది MCGలో అతని 700వటెస్ట్ వికెట్ – ఇది నమ్మశక్యం కాదు,” అని లాంగర్ చెప్పాడు. వార్నర్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.