IND VS SL: టీమిండియాకు భారీ షాక్‌.. లంకతో వన్డే సిరీస్‌ నుంచి బుమ్రా ఔట్‌.. కారణమదేనా?

|

Jan 09, 2023 | 3:15 PM

పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ లేని కారణంగా బుమ్రాను జట్టుకు దూరంగా ఉంచాలని బీసీసీఐ కీలక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే టీ మిండియా ఆటగాళ్లు గౌహతికి చేరుకున్నా బుమ్రా ఇంకా ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు.

IND VS SL: టీమిండియాకు భారీ షాక్‌.. లంకతో వన్డే సిరీస్‌ నుంచి బుమ్రా ఔట్‌.. కారణమదేనా?
Jasprit Bumrah
Follow us on

శ్రీలంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గౌహతి వేదికగా రేపు(జనవరి 10) మొదటి వన్డే జరగనుంది. కాగా ఈ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రాకు స్థానం కల్పించింది బీసీసీఐ. సుమారు 4 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా వస్తే బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా మారుతుందని భావించింది. అయితే మొదటి మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు షాక్‌ తగిలింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ లేని కారణంగా బుమ్రాను జట్టుకు దూరంగా ఉంచాలని బీసీసీఐ కీలక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే టీ మిండియా ఆటగాళ్లు గౌహతికి చేరుకున్నా బుమ్రా ఇంకా ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా సెప్టెంబర్ 2022 నుండి క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ కూడా ఆడలేకపోయాడు. దీని తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఎన్‌సీఏ కూడా బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించింది. దీంతో టీమిండియా సెలక్టర్లు వెంటనే అతడిని శ్రీలంకతో వన్డే జట్టులో చేర్చారు. అయితే మున్ముందు కీలక సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో తొందరపడకూడదని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

కాగా ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ కూడా ఆడాల్సి ఉంది. మరోవైపు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా కీలకమే. అయితే త్వరలో జరిగే న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో బుమ్రా ఆడవచ్చని సమాచారం. జనవరి 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. దీని తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. కాగా లంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే గౌహతికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

భారత వన్డే జట్టు:

రోహిత్ శర్మ , శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..