IND vs SA: విరాట్ కోహ్లీ సెంచరీ కరవు తీరేది అప్పుడే..: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Jan 03, 2022 | 9:53 AM

Virat Kohli-Ajinkya Rahane: కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేల బ్యాటింగ్‌పై కోచ్ ద్రవిడ్ స్పందించాడు. ఈ బ్యాట్స్‌మెన్‌లు మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతున్నారని అతను అభిప్రాయపడ్డాడు.

IND vs SA: విరాట్ కోహ్లీ సెంచరీ కరవు తీరేది అప్పుడే..: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli And Rahul Dravid
Follow us on

Virat Kohli-Ajinkya Rahane: టీం ఇండియా ఫామ్‌లో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం రెండో మ్యాచ్ నేటి నుంచి అంటే జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. దీనికిముందు భారత ఆటగాళ్ల గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్ బహిరంగంగా మాట్లాడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల గురించి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ శుభారంభాలను పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. కోహ్లీ సెంచరీ ఎప్పుడు చేస్తాడనే ప్రశ్నకు కూడా ద్రవిడ్ సమాధానమిచ్చాడు. దీంతో పాటు కెప్టెన్ కోహ్లీ ఎప్పుడు మీడియా ముందుకు వస్తాడో కూడా తేల్చి చెప్పాడు.

కోహ్లి సెంచరీ కొట్టడంపై ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘విరాట్ బ్యాట్‌తో త్వరలో భారీ స్కోరు చేయవచ్చని భావిస్తున్నాను. నిరంతరం కష్టపడి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మూడో మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కానుంది. ఈ మ్యాచులో స్పెషల్ రికార్డు చేస్తాడని అనుకుంటున్నాను” అని అన్నాడు.

లోకేశ్ రాహుల్‌పై మాట్లాడుతూ, “ప్రతి బ్యాట్స్‌మెన్ మంచి ప్రారంభాన్ని పెద్ద స్కోర్‌గా మార్చలేరు. గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై ఒక రోజులో మూడు వికెట్లకు 272 పరుగులు చేయడం చాలా అరుదు. ప్రస్తుతం దీని కంటే మెరుగ్గా ఆడతాం” అని తెలిపాడు.

కోహ్లి-రహానే, పుజారాలను ప్రస్తావిస్తూ.. ‘విరాట్, రహానేలు ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే ఫాంలోకి వస్తారని జట్టు భావిస్తోంది. ప్రతిసారీ మెరుగ్గా రాణించటం అంత సులభం కాదు. త్వరలో ఇద్దరూ భారీ స్కోరు సాధిస్తారని ఆశిస్తున్నాను. గత కొన్నేళ్లుగా పుజారా జట్టు తరఫున పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ లాంటి వారు కూడా ఇక్కడ రాణించగలిగితే చాలా బాగుంటుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు తమ ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది” అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

సెంచూరియన్ టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ లోకేష్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశాడు. విరాట్ 35, రహానే 48 పరుగులు చేసి ఔటయ్యారు. పుజారా తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Also Read: IND vs SA: పాయింట్లు తగ్గిస్తే ఇబ్బందేమి లేదు.. కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి..

Viral Photo: స్వీట్‌కార్న్ అమ్మేది టీమిండియా టెస్ట్ సారథేనా? నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటో