India Probable Playing 11: తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ XIలో వీరికి చోటు.. దక్షిణాఫ్రికాలో మొదటి మ్యాచ్ ఆడనున్న ఐదుగురు?

|

Dec 21, 2021 | 8:00 PM

IND vs SA Test Series: గాయం కారణంగా చాలా మంది వెటరన్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో ఆడడంలేదు. అటువంటి పరిస్థితిలో యువ ఆటగాళ్లందరికీ మొదటి టెస్టులో ఆడే అవకాశం లభిస్తుంది.

India Probable Playing 11: తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ XIలో వీరికి చోటు.. దక్షిణాఫ్రికాలో మొదటి మ్యాచ్ ఆడనున్న ఐదుగురు?
Ind Vs Sa
Follow us on

India Probable Playing 11: భారత జట్టు (IND) ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా (SA) పర్యటనలో ఉంది. డిసెంబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే సెంచూరియన్ చేరుకుని ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుకు కట్టుదిట్టంగా శిక్షణ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ పర్యటన టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా గత 29 ఏళ్లలో ఆఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవకపోవడంతో ఈసారి కూడా చరిత్ర సృష్టించే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆటగాళ్లను చేర్చనున్నారు..
స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవల గాయపడ్డాడు. ఈ కారణంగా అతను టెస్ట్ సిరీస్‌లో ఆడలేడు. రోహిత్ శర్మ లేకపోవడంతో, కేఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ భారత్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఛెతేశ్వర్ పుజారా కూడా రాహుల్‌తో రాణించగలడు. రాహుల్, మయాంక్ మాత్రమే భారత్‌కు ఓపెనర్‌గా నిలిచే అవకాశం ఉంది.

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్..
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా జరగనుంది. రెండో మ్యాచ్‌ జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో, మూడోది, చివరి మ్యాచ్‌ జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది.

Also Read: Cricket: 16 సిక్సర్లు, 571 పరుగులు.. 4 అర్ధ సెంచరీలు.. మ్యాచ్‌ చివర్లో అదిరిపోయే ట్విస్ట్.!

Watch Video: స్వింగ్‌ బౌలింగ్‌ ముందు తేలిపోతున్న ఆ ఇద్దరు.. ధోని స్టూడెంట్‌ను రంగంలోకి దింపిన రాహుల్ ద్రవిడ్..!