వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసినా ఫైనల్‌లో దురదృష్టం వెక్కిరించింది. ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా పర్యటనతోనే టీమిండియాకు అసలైన పరీక్ష ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది, దీనికి గురువారం (నవంబర్ 30) జట్టును ప్రకటించవచ్చు. అయితే, ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం ఇంకా మిగిలి ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్‌కు దూరమయ్యాడు. కాబట్టి రోహిత్ శర్మ ఇక్కడ అందుబాటులో ఉండాలని అందరూ భావిస్తున్నారు. ఇక సౌతాఫ్రికా టూర్ గురించి మాట్లాడుకుంటే టీమ్ ఇండియా ఇక్కడ 3 టీ20, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మొత్తం జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచ కప్ తర్వాత, సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని, మిగిలిన జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతున్నారని మీకు తెలియజేద్దాం. దక్షిణాఫ్రికా పర్యటన ముఖ్యమైనది. పైగా చాలా కీలకం. కాబట్టి టీమ్ ఇండియా బలమైన టీమ్‌ను పంపాలని భావిస్తోంది. ఇక ఈ టూర్‌లో టెస్టు సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇప్పటికే సూచించినందున, మరికొందరు ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమితో రోహిత్ శర్మ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫైనల్ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన దృశ్యం అందరికీ గుర్తుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్ నుంచి కొత్త ఛాలెంజ్ మొదలుకానుంది. కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు ఇక్కడ లేనందున, రోహిత్ అందుబాటులో ఉండాలని బోర్డు కోరుకుంటుంది. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు రోహిత్ అందుబాటులో ఉంటే ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్ లు ఆడలేదు. రోహిత్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉంటే ఐపీఎల్‌తో పాటు టీ 20 ప్రపంచ కప్‌కు కూడా సిద్ధం కావచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..