IND vs SA Series: ‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం గర్వకారణం.. సిరీస్ మాదే’

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా డెవోల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్‌లను ప్రశంసించాడు. IPL 2022 సీజన్‌లో మిల్లర్ తన గుజరాత్ టైటాన్స్ జట్టును ఛాంపియన్‌గా కూడా చేశాడు.

IND vs SA Series: అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం గర్వకారణం.. సిరీస్ మాదే
Ind Vs Sa David Miller

Updated on: Jun 02, 2022 | 7:30 AM

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను తన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టును కూడా ఛాంపియన్‌గా చేశాడు. ఈ విజయంతో ప్రస్తుతం మిల్లర్ భారీ బహుమతిని పొందబోతున్నాడు. టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మిల్లర్‌కు అవకాశం లభించే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఆఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ టెంబా బావుమా పేర్కొన్నాడు. భారత్‌కు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో బావుమా మాట్లాడుతూ, ‘ఆటగాళ్ళను ఫామ్‌లో చూడటం ఎల్లప్పుడూ మంచిది. డేవిడ్ లాంటి ఆటగాడు గుజరాత్ జట్టుతో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో జట్టులోకి వచ్చాడు’ అని పేర్కొన్నాడు.

అదే ఊపును కొనసాగిస్తాడా..

బావుమా మాట్లాడుతూ, ‘అతను ఐపీఎల్‌లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అతను జట్టులో అంతర్భాగం. అతనిపై మాకు నమ్మకం ఉంది. దానిని కొనసాగిస్తాం. అతను అలా భావిస్తే, అతనికి బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నంలో అతని ఆర్డర్‌లోకి చేర్చే అవకాశం కూడా ఉంది. జట్టులో అతని బలమైన స్థానాన్ని మేం చూస్తున్నాం. ఆటగాళ్లందరూ బాగా ఆడటానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన తెలిపాడు.

ఇవి కూడా చదవండి

డెవోల్ట్ బ్రెవిస్‌కు మరింత సమయం కావాలి..

ముంబై ఇండియన్స్‌ తరపున మంచి ప్రదర్శన ఇచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడుతూ, అతను తన నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. టెంబా బావుమా మాట్లాడుతూ, ‘అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అతని ఆటను మెరుగుపరుచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అతనికి అవకాశం ఇవ్వాలి. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడికి అతను వెంటనే తలొగ్గకూడదు. అతనికి కొంత సమయం ఇవ్వాలి’ అంటూ ఆయన పేర్కొన్నాడు. భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు జూన్ 9 నుంచి 19 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

సిరీస్ కోసం రెండు జట్ల స్క్వాడ్‌లు..

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నార్కియా, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రైజ్ స్తిబ్స్, తబ్రైజ్ స్హంబ్స్ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.

టీమ్ ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.