IND vs SA T20 Team Squad 2022: శాంసన్‌కు షాక్.. ఉమ్రాన్‌కు బూస్ట్.. దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

IND vs SA T20 Team Announcement: దక్షిణాఫ్రికా జట్టుతో 5 T20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌ టీం స్వ్కాడ్ సిద్ధమైంది. ఈ సిరీస్‌కు మాత్రమే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.

IND vs SA T20 Team Squad 2022: శాంసన్‌కు షాక్.. ఉమ్రాన్‌కు బూస్ట్.. దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?
India Vs South Africa T20 Team Squad 2022

Updated on: May 22, 2022 | 6:11 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 తర్వాత భారత క్రికెటర్ల షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్(IND vs SA) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం ముంబైలో సెలక్టర్ల సమావేశం నిర్వహించి, భారత జట్టును ప్రకటించారు. ఆఫ్రికా సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, టీ20 జట్టుతోపాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడే జట్టును కూడా నేడు ప్రకటించారు.కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌లో విశ్రాంతిని ఇచ్చారు. దీంతో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం సమతూకం పాటించారు. టీమ్ ఇండియా ఎంపికలో, అనుభవం, యువ ఉత్సాహం మధ్య సామరస్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాగితంపై కనిపించే ఈ జట్టు మైదానంలో కూడా మెరుగ్గా రాణించాలనే పూర్తి ఆశతో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. దినేష్ కార్తీక్ టీ20 జట్టులోకి మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే భారత జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ ఎంట్రీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ కోసం భారత స్వ్కాడ్..

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Ind Vs Sa: సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదేనా.. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. సారథిగా ఎవరంటే?

ఆయనతో విభేదాలు లేవు.. ఆ వార్తలన్నీ అవాస్తవం: పుకార్లను కొట్టిపారేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్..