IND vs SA, 2nd Test Day 3, Highlights: మూడోరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు

| Edited By: Anil kumar poka

Feb 19, 2022 | 6:48 PM

IND vs SA, 2nd Test, Day 3, LIVE Score in Telugu: జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

IND vs SA, 2nd Test Day 3, Highlights: మూడోరోజు ముగిసిన ఆట.. సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు
Ind Vs Sa, 2nd Test Day 3

IND vs SA, 2nd Test Day 3, Live Score: భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. విజయానికి 122 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో కెప్టెన్ డీన్‌ ఎల్గర్ 46 పరుగులు, వాన్‌ డస్సెన్ 11 పరుగులతో ఉన్నారు. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో అశ్విన్ 1, శార్దుల్‌ ఠాగూర్‌ ఒక వికెట్ సాధించారు. కాగా భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయి సౌతాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ సరిగ్గా రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. మూడో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 85/2 పరుగులతో ఆట ప్రారంభించగా.. క్రీజులో నిలిచిన చటేశ్వార పూజారా, అజింకా రహానె ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ని గట్టెక్కించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. పూజారా 86 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 53 పరుగులు, రహానె 78 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌తో 58 పరుగులు చేశారు. అయితే ఈ ప్రారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కొనసాగించలేకపోయారు.

వీరిద్దరు వెనువెంటనే ఔట్ కావడంతో మిగతావారెవ్వరు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. హనుమ విహారి ఒక్కడే చివరి వరకు నాటౌట్‌గా ఉండి 40 పరుగులు (84 బంతుల్లో 6 ఫోర్లు) చేశాడు. శార్దుల్‌ ఠాగూర్‌ 28 పరుగులు పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 266 పరుగులకు ఆలౌట్‌ అయింది.

శార్దూల్ ఠాకూర్ అద్భుతాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆతిథ్య జట్టును ఏడు వికెట్లతో మోకరిల్లేలా చేసిన భారత జట్టు ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు ఇది చాలా ముఖ్యమైనది.

ఓపెనర్ విఫలమయ్యాడు..
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనర్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో, జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఎనిమిది పరుగులు మాత్రమే చేయగా, మయాంక్ అగర్వాల్ తన ఇన్నింగ్స్‌ను 23 పరుగులకు మించి తీసుకోలేకపోయాడు.

రెండు జట్ల ప్లేయింగ్-XI
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడాన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, రాసి వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, కైల్ వెరెన్ (వికెట్), మార్కో యాన్సన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్‌గిడి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Feb 2022 10:53 PM (IST)

తొలి టీ20ఐలో భారత్ ఘన విజయం

తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ఐల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

  • 05 Jan 2022 09:32 PM (IST)

    మూడో రోజు ముగిసిన ఆట

    భారత్‌, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. విజయానికి 122 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో డీన్‌ ఎల్గర్ 46 పరుగులు, డస్సెన్ 11పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్‌ సాధించారు. కాగా భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే..

  • 05 Jan 2022 08:22 PM (IST)

    100 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో డీన్‌ ఎల్గర్ 36 పరుగులు, వాన్‌ డస్సెన్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయం సాధించాలంటే ఇంకా 140 పరుగులు చేయాలి. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్‌ సాధించారు.

  • 05 Jan 2022 08:03 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. కీగన్‌ పీటర్సన్‌ 28 పరుగులకు ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండు వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 93 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 147 పరుగులు చేయాలి. భారత బౌలర్లలో అశ్విన్ 1, శార్దుల్‌ ఠాగూర్‌ ఒక వికెట్ సాధించారు.

  • 05 Jan 2022 06:50 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 11 ఓవర్లలో 50 పరుగులు దాటింది. క్రీజులో డీన్‌ ఎల్గర్ 17 పరుగులు, పీటర్సన్ 4 పరుగులతో ఆడుతున్నారు. విజయం సాధించాలంటే ఇంకా 188 పరుగులు చేయాలి. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఒక వికెట్ సాధించాడు.

  • 05 Jan 2022 06:47 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. మార్‌క్రమ్ 31 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాగూర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 192 పరుగులు చేయాలి.

  • 05 Jan 2022 06:16 PM (IST)

    టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 34/0

    టీ బ్రేక్ సమయానికి సౌతాప్రికా 7 ఓవర్లలో 34 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌ 24 పరుగులు, డీన్‌ ఎల్గర్ 10 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి 206 పరుగుల దూరంలో ఉంది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

  • 05 Jan 2022 05:46 PM (IST)

    బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా

    240 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లుగా మార్‌క్రమ్, డీన్‌ ఎల్గర్ క్రీజులోకి వచ్చారు.

  • 05 Jan 2022 05:33 PM (IST)

    భారత్ 266 పరుగులకు ఆలౌట్‌

    భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఎంగిడి బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌల్డ్‌ అయ్యాడు. హనుమవిహారి 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ సౌతాఫ్రికా కంటే 239 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత ప్లేయర్లలో చటేశ్వార పూజారా, అజింకా రహానె హాఫ్ సెంచరీలు సాధించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 3 వికెట్‌ సాధించారు.

  • 05 Jan 2022 05:16 PM (IST)

    250 పరుగులు దాటిన భారత్

    భారత్ 57 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు దాటింది. క్రీజులో హనుమ విహారి 25 పరుగులు, మహమ్మద్‌ సిరాజ్ 0 పరుగులతో ఆడుతున్నారు. ఇప్పటివరకు ఇండియా.. సౌతాఫ్రికా కంటే 223 పరుగుల ఆధిక్యం సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 2 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్ సాధించారు.

  • 05 Jan 2022 05:13 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జస్ప్రీత్‌ బుమ్రా 7 పరుగులకు ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో జాన్సన్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 218 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 2 వికెట్లు, ఎంగిడి 2 వికెట్లు సాధించారు.

  • 05 Jan 2022 04:50 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమి డకౌట్‌ అయ్యాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 201 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 1 వికెట్‌ సాధించారు.

  • 05 Jan 2022 04:42 PM (IST)

    భారత్ ఆధిక్యం 200 పరుగులు

    భారత్ ఇప్పటివరకు సౌతాఫ్రికా కంటే 200 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 50.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. క్రీజులో హనుమవిహారి 11 పరుగులు, మహ్మద్ షమి 0 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

  • 05 Jan 2022 04:41 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఏడో వికెట్‌ కోల్పోయింది. శార్దుల్‌ ఠాగూర్ 28 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో మహవీర్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 198 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 2 వికెట్లు, ఎంగిడి 1 వికెట్‌ సాధించారు.

  • 05 Jan 2022 04:22 PM (IST)

    200 పరుగులు దాటిన భారత్

    భారత్ 46 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు దాటింది. క్రీజులో హనుమ విహారి 6 పరుగులు, శార్దుల్‌ ఠాగూర్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఇప్పటివరకు ఇండియా.. సౌతాఫ్రికా కంటే 174 పరుగుల ఆధిక్యం సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 1, ఎంగిడి 1 వికెట్ సాధించారు.

  • 05 Jan 2022 04:16 PM (IST)

    రెండో సెషన్ ప్రారంభం

    రెండో సెషన్ ప్రారంభమైంది. క్రీజులో క్రీజులో హనుమవిహారి 6 పరుగులు, శార్దుల్ ఠాగూర్ 4 పరుగులతో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ ఆధిక్యం 161 పరుగులకు చేరింది.

  • 05 Jan 2022 03:42 PM (IST)

    లంచ్‌ బ్రేక్ సమయానికి భారత్ 188/6

    భారత్ మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి 6వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 161 పరుగులకు చేరింది. క్రీజులో హనుమవిహారి 6 పరుగులు, శార్దుల్ ఠాగూర్ 4 పరుగులతో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 1 వికెట్, ఎంగిడి ఒక వికెట్ సాధించారు. అంతకు ముందు చటేశ్వరా పూజారా, అజింకా రహానె హాఫ్ సెంచరీలు చేశారు.

  • 05 Jan 2022 03:38 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ ఆరో వికెట్‌ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులకు ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో వెరియానె క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 160 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 1 వికెట్, ఎంగిడి ఒక వికెట్ సాధించారు. సాధించారు.

  • 05 Jan 2022 03:14 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ ఐదో వికెట్‌ కోల్పోయింది. రిషబ్‌ పంత్ 0 పరుగులకు ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో వెరియానె క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 145 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 1 వికెట్ సాధించారు.

  • 05 Jan 2022 02:57 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చటేశ్వర పుజారా 53 పరుగులకు ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 136 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

  • 05 Jan 2022 02:47 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన భారత్

    భారత్ మూడో వికెట్‌ కోల్పోయింది. అజింకా రాహానె 58 పరుగులకు ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో వెరియానె క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కాగా సౌతాఫ్రికా కంటే భారత్‌ 128 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

  • 05 Jan 2022 02:32 PM (IST)

    150 పరుగులు దాటిన భారత్

    భారత్ 33.3 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు దాటింది. క్రీజులో చటేశ్వర పుజారా 51 పరుగులు, అజింకా రహానె 53 పరుగులతో ఆడుతన్నారు. ఇప్పటివరకు ఇండియా.. సౌతాఫ్రికా కంటే 123 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

  • 05 Jan 2022 02:30 PM (IST)

    రహానే-పుజారా సెంచరీ భాగస్వామ్యం..

    భారత టెస్టు జట్టులో అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలు మూడో వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 131 బంతుల్లో 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం రహనె 52, పుజారా 51 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. భారత ఆధిక్యం120 పరుగులు దాటింది.

  • 05 Jan 2022 02:26 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన అజింకా రహానె

    అజింకా రహానె హాఫ్ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్‌ సాయంతో 52 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. మరోవైపు చటేశ్వరా పుజారా 51 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌ సౌతాఫ్రికా కంటే 121 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

  • 05 Jan 2022 02:15 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన చటేశ్వరా పుజారా

    చటేశ్వరా పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. 62 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మరోవైపు అజింకా రహానె 43 పరుగులతో హాఫ్‌ సెంచరీ చేరువలో ఉన్నాడు. భారత్‌ సౌతాఫ్రికా కంటే 110 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

  • 05 Jan 2022 01:42 PM (IST)

    రహానే-పుజారా అర్థసెంచరీ భాగస్వామ్యం..

    భారత టెస్టు జట్టులో అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలు మూడో రోజు ఆటను ధాటిగానే ప్రారంభించారు. బౌండరీలతో ఇన్నింగ్స్‌లో వేగం పెంచుతూ తమ ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం రహనె 19, పుజారా 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత ఆధిక్యం 74 పరుగులకు చేరింది.

  • 05 Jan 2022 01:39 PM (IST)

    చూపులన్నీ రహానే-పుజారాపైనే..

    భారత టెస్టు జట్టులో అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా ఈ రోజు ఆటను ప్రారంభించనున్నారు. వీరిద్దరూ టీమ్ ఇండియా స్కోరు 85/2 నుంచి ఇన్నింగ్స్‌ను భారీ ఆధిక్యం వైపు తీసుకెళ్తారో లేదో చూడాలి. వీరిద్దరూ చాలా కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో భారీ ఇన్నింగ్స్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ తమ బ్యాట్‌తో భారీ స్కోరు చేసి జట్టుకు బలమైన ఆధిక్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు.

  • 05 Jan 2022 01:39 PM (IST)

    దక్షిణాఫ్రికా వికెట్లను కోరుకుంటుంది..

    ఒకవైపు దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టి బలమైన ఆధిక్యం సాధించి పట్టు బిగించాలని భారత్‌ చూస్తుండగా, ఆతిథ్య జట్టు బౌలర్లు మాత్రం టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌లను వీలైనంత త్వరగా ఔట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కగిసో రబడ, లుంగి ఎంగిడి, మార్కో యాన్సన్‌ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్స్ ఎక్కువసేపు నిలుస్తారో లేదో చూడాలి.

  • 05 Jan 2022 01:39 PM (IST)

    మూడో రోజు ఆట ప్రారంభం..

    భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు టామ్ మైదానంలో ఉన్నాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్ తన జట్టుతో మాట్లాడుతున్నాడు. భారత బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులోకి వచ్చారు.

  • Follow us on