IND vs SA, 2nd ODI, Highlights: రెండో వన్డేలోనూ భారత్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం.. సిరీస్ కైవసం

|

Jan 22, 2022 | 7:31 AM

IND vs SA, 2nd ODI, Highlights: రెండో వన్డేలోనూ భారత్‌ ఓటమి పాలైంది. దీంతో 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. దక్షిణాఫ్రికా టీం మరో 11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

IND vs SA, 2nd ODI, Highlights: రెండో వన్డేలోనూ భారత్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం.. సిరీస్ కైవసం
Ind Vs Sa, 2nd Odi

రెండో వన్డేలోనూ భారత్‌కు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ‌్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకుని రాహుల్ సేనకు నిరాశే మిగిల్చింది. భారత్ ఇచ్చిన 287 పరుగుల లక్ష్యాన్ని, దక్షిణాప్రికా టీం మరో 11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. దక్షిణాఫ్రికా టీంలో మలాన్ 91, డికాక్ 78, బవుమా 35, మర్క్రాం 37 నాటౌట్, డుస్సెన్ 37 నాటౌట్‌గా నిలిచారు. అంతకు‌ముందు టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత్ 287 పరుగులు చేసింది. ధావన్ 55, కేఎల్ రాహుల్ 29, విరాట్ కోహ్లీ 0, రిషబ్ పంత్ 85, శ్రేయాస్ అయ్యర్ 11, వెంకటేష్ అయ్యర్ 22, శార్ధుల్ ఠాకూర్ 40 నాటౌట్, అశ్విన్ 25 నాటౌట్ పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ 2, మగల, మక్రాం, మహరాజ్, అండిలే తలో వికెట్ పడగొట్టారు.

భారత్ -దక్షిణాఫ్రికా(India vs South Africa) మధ్య వన్డే సిరీస్‌(ODI Series)లో రెండో మ్యాచ్ ప్రస్తుతం కంటే కొంచెం ఆలస్యంగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. తొలి మ్యాచ్‌ జరిగిన మైదానంలోనే రెండో వన్డే కూడా జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా పరిస్థితి ఈ మ్యాచ్‌లో డూ ఆర్ డై అన్నట్లుగా తయారైంది. ఈ మ్యాచులో ఓడిపోతే సిరీస్ కోల్పావాల్సిందే. సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈరోజు కేఎల్ రాహుల్ సేన తప్పక విజయం సాధించాల్సిందే.

ఇరు జట్ల ప్లేయింగ్ XI:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), యనమన్ మలన్, క్వింట్వాన్ డి కాక్ (కీపర్), ఐదాన్ మార్క్‌రామ్, రెసీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహుల్క్‌వాయో, సిసంద మగల, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, తబ్రేజ్ షమ్సీ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jan 2022 10:08 PM (IST)

    రెండో వన్డేలోనూ సౌతాఫ్రికా ఘన విజయం.. సిరీస్ కైవసం

    రెండో వన్డేలోనూ భారత్‌కు పరాజయం తప్పలేదు. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకుని రాహుల్ సేనకు నిరాశే మిగిల్చింది. భారత్ ఇచ్చిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి సాధించింది.

  • 21 Jan 2022 09:36 PM (IST)

    250 పరుగులు దాటిన సౌతాఫ్రికా స్కోర్..

    రెండో వన్డేలోనూ సౌతాఫ్రికా విజయానికి చేరువైంది. విజయానికి 51 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం 42 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.

  • 21 Jan 2022 09:14 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

    దక్షిణాఫ్రికా బవుమా (35) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. 214 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో బవుమా పెవిలియన్ చేరాడు. విజయానికి మరో 80 పరుగుల దూరంలో నిలిచింది.

  • 21 Jan 2022 09:06 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

    దక్షిణాఫ్రికా మలాన్(91) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 212 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో మలాన్ పెవిలియన్ చేరాడు. విజయానికి మరో 90 పరుగుల దూరంలో నిలిచింది.

  • 21 Jan 2022 08:59 PM (IST)

    200 దాటిన సౌతాఫ్రికా స్కోర్..

    రెండో వన్డేలోనూ సౌతాఫ్రికా విజయానికి చేరువైంది. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తోన్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ స్కోర్‌ను 200 పరుగులు దాటించారు. దీంతో విజయానికి మరో 82 పరుగుల దూరంలో నిలిచింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది.

  • 21 Jan 2022 08:21 PM (IST)

    150 దాటిన సౌతాఫ్రికా స్కోర్..

    రెండో వన్డేలోనూ సౌతాఫ్రికా విజయానికి చేరువైంది. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తోన్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ స్కోర్‌ను 150 పరుగులు దాటించారు. దీంతో విజయానికి మరో 131 పరుగుల దూరంలో నిలిచింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది.

  • 21 Jan 2022 08:10 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

    ఎట్టకేలకు భారత బౌలర్లకు ఒక వికెట్ దక్కింది. డికాక్ 78 పరుగుల వద్ద శార్దుల్ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 22. 3 ఓవర్లకు 139 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 149 పరుగులు చేయాల్సి ఉంది.

  • 21 Jan 2022 07:37 PM (IST)

    100 పరుగులకు చేరిన సౌతాఫ్రికా స్కోర్..

    సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతూ టీం స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. విజయానికి మరో 182 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 16.2 ఓవర్లకు 106 పరుగులుగా నిలిచింది.

  • 21 Jan 2022 07:18 PM (IST)

    డికాక్ అర్థసెంచరీ..

    288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ధాటిగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. ఓపెనర్లుగా డికాక్, మలాన్ అర్ధసెంచరీ భాగస్వామ్యంతో పాటు డికాక్ కేవలం 38 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు సౌతాఫ్రికా 75 పరుగులు చేసిం

  • 21 Jan 2022 07:04 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా..

    టీమిండియా బౌలర్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. వికెట్ల కోసం బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ 40, మలాన్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 06:31 PM (IST)

    మొదలైన సౌతాఫ్రికా బ్యాటింగ్..

    288 పరుగుల లక్ష్యంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, మలాన్ బరిలోకి దిగారు.

  • 21 Jan 2022 05:57 PM (IST)

    సౌతాఫ్రికా టార్గెట్ 288

    టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు న‌ష్టపోయి 287 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 21 Jan 2022 05:39 PM (IST)

    250 దాటిన స్కోర్..

    టీమిండియా 46 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శార్దుల్ ఠాకూర్ 29, రవించద్రన్ అశ్విన్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 05:30 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    వెంకటేష్ అయ్యర్ (22) రూపంలో టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 43.5 ఓవర్లో 239 పరుగుల వద్ద 6వ వికెట్‌ను కోల్పోయింది.

  • 21 Jan 2022 05:04 PM (IST)

    200 దాటిన టీమిండియా స్కోర్..

    టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 200 స్కోర్‌ను చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా 38 ఓవర్లకు 213 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 13, శార్దుల్ ఠాకూర్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 05:00 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    శ్రేయాస్ అయ్యర్(11) రూపంలో ఐదో వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. దీంతో 36.5 ఓవర్లలో 207 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 21 Jan 2022 04:36 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    డ్రింక్స్ బ్రేక్ తరువాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ మరోసారి కష్టాల్లో పడింది. కేఎల్ రాముల్ పెవిలియన్ చేరిన తరువాత, రిషబ్ పంత్(85) షంమ్సీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 32.3 ఓవర్లలో 183 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 21 Jan 2022 04:29 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్..

    డ్రింక్స్ బ్రేక్ తరువాత టీమిండియా కీలక ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. కేఎల్ రాహుల్(55) మగలా బౌలింగ్‌లో డుస్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 31.1 ఓవర్లలో 179 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 21 Jan 2022 04:12 PM (IST)

    కేఎల్ అర్థసెంచరీ..

    కేఎల్ రాహుల్ 71 బంతుల్లో 50 పరుగులు చేసి రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మరోవైపు పంత్ కూడా అద్భుతంగా ఆడుతూ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించాడు.

  • 21 Jan 2022 04:10 PM (IST)

    100 పరుగుల భాగస్వామ్యం..

    కేఎల్ రాహుల్(49), రిషబ్ పంత్(74) కీలక ఇన్నింగ్స్‌తో దూసుకెళ్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య 94 బంతుల్లో 100 పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది.

  • 21 Jan 2022 04:08 PM (IST)

    150 దాటిన టీమిండియా స్కోర్..

    కేఎల్ రాహుల్ (48), రిషబ్ పంత్(63) అద్బుత బ్యాటింగ్‌తో భారత్ 150 పరుగులు దాటింది. రాహుల్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధిస్తుంటే, పంత్ తన మార్క్ దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 28 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 162 పరుగులు సాధించింది.

  • 21 Jan 2022 03:52 PM (IST)

    పంత్ అర్థసెంచరీ..

    రెండు కీలక వికెట్లు పడిన తరువాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 21 Jan 2022 03:48 PM (IST)

    పంత్, రాహుల్ కీలక భాగస్వామ్యం..

    రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పంత్, కేఎల్ రాహుల్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు. ప్రస్తుతం పంత్ 49, కేఎల్ రాహుల్ 43 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 03:28 PM (IST)

    100 పరుగులకు చేరిన భారత స్కోర్..

    టీమిండియా 19.1 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో కేఎల్ రాహుల్ 40, రిషబ్ పంత్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 03:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చాటుతున్నారు. వరుసగా రెండు కీలక వికెట్లు తీసి భారత్‌కు షాకిచ్చారు. ధావన్ (29), కోహ్లీ(0) పెవిలియన్ చేరారు. 64 పరుగుల వద్ద రెండో వికెట్‌గా కోహ్లీ డకౌట్ అయ్యాడు.

  • 21 Jan 2022 02:57 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    12 వ ఓవర్లో దక్షిణాఫ్రికాకు వికెట లభించింది. అది కూడా తొలి వన్డేలో చుక్కలు చూపించిన ధావన్‌ను పెవిలియన్ చేర్చి భారత్‌కు షాకిచ్చారు. ధావన్(29) 11.4 ఓవర్లో మాక్రాం బౌలింగ్‌లో మగలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 63 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 21 Jan 2022 02:44 PM (IST)

    అర్థ సెంచరీ దాటిన భారత్ స్కోర్..

    భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా స్కోర్ 50 పరుగులు దాటింది. రాహుల్ 20, శిఖర్ ధావన్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 21 Jan 2022 02:15 PM (IST)

    మొదలైన టీమిండియా బ్యాటింగ్..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. తొలి వన్డేలో అదరగొట్టిన ధావన్.. రెండో వన్డేలోనూ ఆకట్టుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 21 Jan 2022 02:10 PM (IST)

    టాస్ గెలిచిన టీమిండియా

    కీలకమైన రెండో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగారు. అయితే ఈ మ్యాచులో విజయం కచ్చితంగా సాధించాలి. లేదంటే సిరీస్‌ కోల్పోవాల్సి వస్తుంది.

Follow us on