IND vs SA 1st Test Day 3 Live: 199 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. భారత్ 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు

|

Dec 29, 2021 | 2:17 PM

IND vs SA 1st Test Day 3 Live Score Updates: భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట మొదలైంది. ఫస్ట్ సెషన్‌లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది...

IND vs SA 1st Test Day 3 Live: 199 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. భారత్ 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు
Ind Vs Sa

IND Vs SA: భారత్ సౌతాఫ్రికా మధ్య మూడోరోజు ఆట ముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోఒక వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులతో కలిసి భారత్ ఆధిక్యం 146 పరుగులుగా ఉంది. అంతకుముందు 276 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్ 327 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఎవ్వరు కనీసం రెండెకల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్‌ 327 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఎక్కడా ఎవ్వరిని క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు సాధిస్తూ కోలుకోలేని దెబ్బ తీశారు. సౌతాఫ్రికా 2 పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయింది. రెండో సెషన్ ప్రారంభంలోనే మరో వికెట్ కోల్పోయింది. ఇలా వరుసగా వికెట్లు పోతూనే ఉన్నాయి. భారత బౌలర్ల ముందు ఎవ్వరు నిలవలేకపోయారు. టెంబా బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి కనీసం 150 పరుగులు దాటేలా చేశాడు. క్వింటన్‌ డికాక్ 34 పరుగులు పర్వాలేదనిపించాడు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 5, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.

భారత్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటీశ్వర్ పుజారా, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), మార్కరమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ముల్దర్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఎనిగిడి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Dec 2021 09:41 PM (IST)

    ముగిసిన మూడో రోజు ఆట

    భారత్ సౌతాఫ్రికా మధ్య మూడోరోజు ఆట ముగిసింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులతో కలిసి భారత్ ఆధిక్యం 146 పరుగులు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా సౌతాఫ్రికా199 పరుగులకు ఆలౌట్ అయింది.

  • 28 Dec 2021 09:29 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. మార్కో జాన్సన్‌ బౌలింగ్‌లో డి కాక్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 12 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి శార్దుల్‌ ఠాకూర్‌ ఎంటర్ అయ్యాడు.

  • 28 Dec 2021 09:14 PM (IST)

    రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా..

    భారత్ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లుగా మయాన్ అగర్వాల్, కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చారు. మొదటి ఓవర్‌లో 6 పరుగులు సాధించారు.

  • 28 Dec 2021 08:54 PM (IST)

    సౌతాఫ్రికా199 పరుగులకు ఆలౌట్‌

    సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్ల ముందు ఎవ్వరు నిలవలేకపోయారు. టెంబా బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ సాధించి కనీసం 150 పరుగులు దాటేలా చేశాడు. క్వింటన్‌ డికాక్ 34 పరుగులు పర్వాలేదనిపించాడు. మిగతా వారెవ్వరు పెద్దగా రాణించలేదు. దీంతో సౌతాఫ్రికా 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 5, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. దీంతో భారత్ 130 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

  • 28 Dec 2021 08:49 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. కాగిసో రబడా 25 పరుగులకు ఔటయ్యాడు. షమి బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 5, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.

  • 28 Dec 2021 08:30 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మార్కో జాన్సెన్‌ 19 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాకూర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 4, శార్దుల్‌ 2, బుమ్రా, సిరాజ్‌, ఒక్కో వికెట్ చొప్పున సాధించారు.

  • 28 Dec 2021 07:49 PM (IST)

    150 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 48.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో మార్కో జాన్సన్ 10, కాగిసో రబడా 4 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 4, బుమ్రా, సిరాజ్‌, శార్దుల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. సౌతాఫ్రికా ఇంకా 174 పరగులు వెనుకబడి ఉంది.

  • 28 Dec 2021 07:42 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. హాఫ్ సెంచరీ హీరో టెంబా బవుమా 52 పరుగులకు ఔటయ్యాడు. షమి బౌలింగ్‌లో పంత్ క్యాచ్‌ పట్టాడు. దీంతో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 4, బుమ్రా, సిరాజ్‌, శార్ధుల్‌ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

  • 28 Dec 2021 07:40 PM (IST)

    హాఫ్ సెంచరీ సాధించిన టెంబా బవుమా

    టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 10 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. దీంతో సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మార్కో జాన్సన్‌ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు.

  • 28 Dec 2021 07:27 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. వియాన్‌ ముల్డర్ 12 పరుగులకు ఔటయ్యాడు. షమి బౌలింగ్‌లో పంత్ క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 3, బుమ్రా, సిరాజ్‌, శార్ధుల్‌ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

  • 28 Dec 2021 06:50 PM (IST)

    ముగిసిన రెండో సెషన్‌..

    రెండో సెషన్‌ ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. టెంబా బవుమా 31 పరుగులు, వియాన్‌ ముల్డర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా ఇంకా 218 పరగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 2, బుమ్రా, సిరాజ్‌, శార్ధుల్‌ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

  • 28 Dec 2021 06:34 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. క్వింటన్‌ డికాక్ 34 పరుగులకు ఔటయ్యాడు. శార్దుల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.

  • 28 Dec 2021 06:10 PM (IST)

    100 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 31.4 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్‌ డికాక్ 31 పరుగులు, బావుమా 30 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 2, బుమ్రా, సిరాజ్‌ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

  • 28 Dec 2021 05:26 PM (IST)

    50 పరుగులు దాటిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్‌ డికాక్ 8 పరుగులు, బావుమా 12 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమి 2, బుమ్రా, సిరాజ్‌ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

  • 28 Dec 2021 04:49 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. డస్సెన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో రహానె క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.

  • 28 Dec 2021 04:46 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్ మార్ క్రమ్‌ 13 పరుగులకు ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లకు సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.

  • 28 Dec 2021 04:23 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    రెండో సెషన్ ప్రారంభంలోనే సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. కీగన్ పీటర్సన్ 15 పరుగులకే ఔటయ్యాడు. మహ్మద్‌ షమి ఓవర్లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో రెండు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా 30 పరుగులు చేసింది.

  • 28 Dec 2021 03:44 PM (IST)

    లంచ్‌ బ్రేక్‌ సమయానికి సౌతాఫ్రికా 21/1

    భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజు లంచ్‌ సమాయానికి సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది.

  • 28 Dec 2021 03:11 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

    బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద ఓపెనర్ డేల్‌ ఎల్గర్‌ ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌ క్యాచ్‌ పట్టాడు.

  • 28 Dec 2021 02:57 PM (IST)

    భారత్‌ 327 పరుగులకు ఆలౌట్‌..

    ఇండియా 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. మూడో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇండియా ఆశించినంతగా రాణించలేదు. త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది. ఎవ్వరూ రెండెంకల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్‌ 327 పరుగులకు ఆలౌట్ అయింది.

Follow us on