IND vs SA: రెండో రోజు ముగిసిన ఆట.. భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు

|

Jan 04, 2022 | 9:55 PM

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకండ్‌

IND vs SA: రెండో రోజు ముగిసిన ఆట.. భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు
Ind Vs Sa
Follow us on

IND vs SA: భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 58 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్లు కెఎల్‌. రాహుల్‌ 8 పరుగులు, మయాంక్ అగర్వాల్‌ 23 పరుగులు త్వరగానే పెవిలియన్ చేరారు. క్రీజులో పూజారా 35 పరుగులు, రహానె 11 పరుగులతో నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలివర్ 1, జాన్సన్ 1 వికెట్‌ సాధించారు.

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 35 పరుగులతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా మొదటి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ డీల్ ఎల్గర్‌ జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. కానీ కీగన్‌ పీటర్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 103 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. కానీ డస్సెన్ ఒక పరుగుకే ఔటై నిరాశపరిచాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన టెంబా బావుమా జట్టుని ముందుండి నడిపించాడు. హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వెరియానె 21, మార్కో జాన్సన్ 21, కేశరాజ్‌ మహారాజ్‌ 21 పరుగులతో రాణించడంతో జట్టు 229 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాగూర్‌ ఏడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమి రెండు వికెట్లు దక్కాయి. జస్ర్పీత్ బుమ్రాకి ఒక వికెట్‌ దక్కింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్పింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

LIC: ఎల్ఐసీ ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 28 రూపాయల ఆదాతో లక్షలు సంపాదించే అవకాశం.. ఎలానో తెలుసుకోండి!

JP Nadda on CM KCR: మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీలు, కార్యక్రమాలకు లేని రూల్స్.. బండి సంజయ్‌కి ఎందుకుః జేపీ నడ్డా

M.S. Raju : నా సినిమా చూసి అందరు చెవులు కోరుకున్నారు.. కానీ చివరకు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎం.ఎస్ రాజు..