IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి

|

Jan 19, 2022 | 10:27 PM

IND Vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా బొలాండ్‌ పార్క్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘోర ఓటమిని చవిచూసింది. సఫారీల దెబ్బకి

IND Vs SA: సఫారీల దెబ్బకి చతికిలపడిన భారత్.. తొలి వన్డేలో ఓటమి
Indian
Follow us on

IND Vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా బొలాండ్‌ పార్క్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘోర ఓటమిని చవిచూసింది. సఫారీల దెబ్బకి 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయకేతనం ఎగరేసింది. భారత మిడిలార్డర్‌ పేకమేడలా కూలడంతో భారత్‌కి ఈ పరిస్థితి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్ల ముందు ఎవ్వరు క్రీజులో నిలవలేకపోయారు. శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లీ, శార్దుల్‌ ఠాగూర్‌ మినహాయించి ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 46 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్ కెఎల్‌ రాహుల్‌ 12 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ జత కలిసారు. ఇరువురు కలిసి స్కోరు బోర్డుని పరుగెత్తించారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ హాప్‌ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అయితే 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్‌ ఔటయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లీ కూడా 60 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. కానీ వెంటనే ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన వారు ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. సపారీలు వరుసగా వికెట్లు తీస్తూ పై చేయి సాధించారు. కానీ చివరలో శార్దుల్‌ ఠాగూర్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌ సాయంతో 50 పరుగులు చేశాడు. జస్ప్రీత్‌ బుమ్రా 14 పరుగులతో నిలిచాడు. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. సౌతాఫ్రికా బౌలర్లలో అండిలే పెహ్లుక్‌ వయో 2, లుంగి ఎంగిడి 2, షామ్‌సీ 2, మార్‌క్రమ్‌ 1 వికెట్‌, కేశవ్ మహారాజ్ 1వికెట్‌ సాధించారు.

అంతకు ముందు టాస్‌ మొదటగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 50 ఓవరల్లో 296 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్‌ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి కెప్టెన్‌ బావుమా, వాన్‌ డస్సెన్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. మెల్ల మెల్లగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తూ భారీ స్కోరు దిశగా కదిలారు. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్‌ పార్ట్‌నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు.

ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్‌ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాన్‌ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ 27 పరుగులు సాధించాడు. భారత్ బౌలర్లు వీరి జంటని విడదీయడంలో విఫలమయ్యారు. ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్‌ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్‌ అశ్విన్ ఒక వికెట్‌ సాధించారు.

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ విత్ ఏటీఎమ్‌ కార్డ్‌.. 2 లక్షల ఇన్సూరెన్స్.. ఏ పథకం కింద లభిస్తాయో తెలుసా..?

Herbal Tea: గొంతు సమస్యలకు ఈ హెర్బల్‌ టీలు సూపర్.. తక్షణ ఉపశమనం..