
India vs South Africa, 2nd T20I: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో పాటు ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది.
7 ప్రయత్నాలు.. 7 ఓటములు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా ఛేజింగ్ రికార్డు బాగానే ఉన్నా, భారీ లక్ష్యాల విషయంలో మాత్రం చతికిలపడుతోంది. ముఖ్యంగా 210 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా 7 సార్లు 210+ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా ఈ ఏడు సందర్భాల్లోనూ భారత్ ఓటమిపాలైంది. మొహాలీ వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లోనూ అదే పునరావృతమైంది.
చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, బ్యాటర్లు విఫలం కావడంతో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
విఫలమైన బూమ్రా-అర్ష్‌దీప్ జోడి..
ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన రికార్డు కూడా బద్దలైంది. పేసర్లు జస్ప్రీత్ బూమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కలిసి ఆడిన గత 14 టీ20 మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. కానీ, 15వ సారి వీరిద్దరూ తుది జట్టులో ఉన్నా భారత్ ఓడిపోవడంతో ఆ విజయాల పరంపరకు బ్రేక్ పడింది.
దక్షిణాఫ్రికాదే పైచేయి.
ఈ విజయంతో టీ20ల్లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ప్రొటీస్ జట్టు భారత్‌పై ఇప్పటివరకు 13 విజయాలు నమోదు చేయగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చెరో 12 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టీమిండియా ఆధిక్యం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.