IND vs SA 2nd ODI Preview: పిచ్ రిపోర్ట్‌తో ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. షాకిస్తోన్న రాయ్‌పూర్‌ లెక్కలు

IND vs SA 2nd ODI Preview: ఇక్కడ పిచ్ విషయానికి వస్తే, ఇప్పటివరకు కేవలం ఒక అంతర్జాతీయ వన్డే (2023లో భారత్ vs న్యూజిలాండ్) మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ సునాయాసంగా గెలిచింది. గణాంకాల ప్రకారం ఇక్కడ పేసర్లకు (67% వికెట్లు) స్పిన్నర్ల కంటే ఎక్కువ అనుకూలత లభిస్తుంది.

IND vs SA 2nd ODI Preview: పిచ్ రిపోర్ట్‌తో ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. షాకిస్తోన్న రాయ్‌పూర్‌ లెక్కలు
Ind Vs Sa

Updated on: Dec 02, 2025 | 1:19 PM

IND vs SA 2nd ODI Preview: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌నూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుండగా, దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

మ్యాచ్ వివరాలు:

తేదీ: 03 డిసెంబర్ 2025

సమయం: మధ్యాహ్నం 01:30 గంటలకు (IST)

ఇవి కూడా చదవండి

వేదిక: షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్.

లైవ్ స్ట్రీమింగ్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్.

తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (135 పరుగులు) అద్భుత సెంచరీతో రాణించగా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో మెరిశారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు, దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడినప్పటికీ, ఆల్ రౌండర్లు మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ పోరాటపటిమతో గట్టి పోటీనిచ్చారు. రెండో వన్డేలో సఫారీ జట్టులో టెంబా బావుమా, కేశవ్ మహారాజ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత జట్టులో తిలక్ వర్మకు అవకాశం దక్కవచ్చని అంచనా.

పిచ్, వాతావరణ రిపోర్ట్..

రాయ్‌పూర్ వాతావరణం క్రికెట్‌కు అనుకూలంగా ఉండనుంది. వర్షం ముప్పు లేదు, ఉష్ణోగ్రత సుమారు 27-28 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పిచ్ విషయానికి వస్తే, ఇప్పటివరకు కేవలం ఒక అంతర్జాతీయ వన్డే (2023లో భారత్ vs న్యూజిలాండ్) మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ సునాయాసంగా గెలిచింది. గణాంకాల ప్రకారం ఇక్కడ పేసర్లకు (67% వికెట్లు) స్పిన్నర్ల కంటే ఎక్కువ అనుకూలత లభిస్తుంది.

హెడ్-టు-హెడ్ (గత 10 మ్యాచ్‌లు):

భారత్ గెలిచినవి: 6

దక్షిణాఫ్రికా గెలిచినవి: 4

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్/తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా తుది జట్టు (అంచనా): రియాన్ రికెల్టన్/టెంబా బావుమా, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్‌కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలాన్ సుబ్రాయన్/కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్.

ప్రస్తుత ఫామ్, హోమ్ కండిషన్స్ దృష్ట్యా భారత్ గెలిచే అవకాశాలు (60%) ఎక్కువగా ఉన్నాయి. అయితే, సఫారీలు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..