Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్.. ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ రాయుళ్లు.. ఏకంగా ఇతర రాష్ట్రాల ఐపీతో..

|

Oct 24, 2021 | 3:17 AM

Ind vs Pak T20 Match: క్రికెట్ మ్యాచ్‌లంటే క్రీడాభిమానులకు పండగే. అందులోనూ 20-20 మ్యాచులంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి బంతికి మ్యాచ్​ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్.. ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ రాయుళ్లు.. ఏకంగా ఇతర రాష్ట్రాల ఐపీతో..
India Vs Pakistan
Follow us on

Ind vs Pak T20 Match: క్రికెట్ మ్యాచ్‌లంటే క్రీడాభిమానులకు పండగే. అందులోనూ 20-20 మ్యాచులంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి బంతికి మ్యాచ్​ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించలేము. క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగుతున్న పొట్టి ఫార్మేట్ మ్యాచుల్లో అయితే క్రికెట్ అభిమానులు మజాను ఆస్వాదిస్తున్నారు. ఇవాళ హాట్ ఫేవర్ అయిన ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రీడాభిమానులతో పాటు.. బెట్టింగ్ రాయుళ్లు మాంచి హుషారు మీద ఉన్నారు. సాధారణంగా దాయాది జట్లైన భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 7.30 జరుగనున్న మ్యాచ్‌పై కూడా అభిమానుల్లో బారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక పందెం రాయుళ్లు కూడా అంతేస్థాయిలో ఊహాగానాలు చేస్తున్నారు. మ్యాచ్‌ గెలుపునకు సంబంధించి భారీ అంచనాలతో పందె రాయుళ్లు పందాలు కాస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఒకరికొకరితో తలపడనున్న పరిస్థితుల్లో జోరుగా పందాలు సాగుతున్నాయి.

రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు..
టీ20 మ్యాచ్‌లను ఆసరాగా చేసుకొని బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇది వరకు రాజస్థాన్, దిల్లీ, చెన్నై, బెంగళూర్కు చెందిన బెట్టింగ్ నిర్వాహకులు నగరాల్లో రూములు అద్దెకి తీసుకుని బెట్టింగ్ నిర్వహించేవారు. గత రెండు మూడేళ్లుగా పోలీసుల నిఘా పెరగడం వల్ల నిర్వాహకులు వెనక్కి తగ్గారు. కొంతమంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టడంతో, సాంకేతికతను ఉపయోగించుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగులు నిర్వహిస్తున్న నాలుగు బృందాలను అదుపులోకి తీసుకున్నామని. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాల ఆట కట్టించడానికి సైబర్ సెల్ పనిచేస్తుందని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అంటున్నారు.

ఇతర రాష్ట్రాల ఐపీ అడ్రస్‌లతో..
పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా బెట్టింగ్ నిర్వాహకులను గుర్తిస్తుండటం వల్ల పందెంరాయుళ్లు ఒకడుగు ముందుకు వేసి పందేలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఐపీ అడ్రస్‌లతో బెట్టింగ్ అప్లికేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సదరు ఐపీ అడ్రసును గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లినా అక్కడ ఎవరూ దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు అధికంగా బెట్టింగులు కొన్ని పర్మిషన్ లేని యాప్స్ ద్వారా ఇంటర్నెట్‌లో బెట్టింగులకు పాల్పడుతున్నారు. అందులో10 క్రీక్, బెట్ వే,1 ఎక్స్ బెట్, ఎక్ బెట్, 24 క్లబ్ లాంటి యాప్స్ లో బెట్టింగ్ కాసి లబోదిబోమంటున్నారు. మొదట్లో కొంత డబ్బులు సంపాదించిన తరువాత బారి మొత్తంలో పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

Also read:

Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..

Sugar: చక్కెరతో ఫేస్‌ క్లీన్.. ఇలా చేయండి మెరిసే అందం మీ సొంతం

గుడ్‌న్యూస్‌.. ఇకపై ఇతరుల టికెట్‌పై ప్రయాణించొచ్చు.. వీడియో