IND vs PAK: 7 నెలల తర్వాత రీఎంట్రీ.. అదరగొట్టిన కేఎల్ రాహుల్..

India vs Pakistan, KL Rahul: కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 100+ భాగస్వామ్యం నమోదు చేశారు. కాగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగుల వద్ద ఔట్ కాగా, 123 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. రాహుల్ 60 బంతుల్లో కెరీర్‌లో 14వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

IND vs PAK: 7 నెలల తర్వాత రీఎంట్రీ.. అదరగొట్టిన కేఎల్ రాహుల్..
Kl Rahul

Updated on: Sep 11, 2023 | 7:18 PM

Asia Cup 2023, India vs Pakistan, KL Rahul: ప్రస్తుతం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, టీమిండియా ప్లేయింగ్ 11కి తిరిగి వచ్చిన కేఎల్ రాహుల్ 60 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ చాలా కాలంగా అన్‌ఫిట్‌గా ఉండటంతో దూరంగా ఉండి ఆసియా కప్‌లో తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో రీఎంట్రీతోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి సెంచరీ భాగస్వామ్యం పంచుకున్నాడు.

కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం..

కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 100+ భాగస్వామ్యం నమోదు చేశారు. కాగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 121 పరుగుల వద్ద ఔట్ కాగా, 123 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. రాహుల్ 60 బంతుల్లో కెరీర్‌లో 14వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

హారీస్ రవూఫ్ ఔట్..

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ఈరోజు ఆడడం లేదు. గాయంతో దూరమయ్యాడు. కాగా, ప్లేయింగ్-11లో రౌఫ్‌ను చేర్చారు. తొలిరోజు 5 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ తన స్పెల్ మిగిలిన ఓవర్లను మరొక బౌలర్ చేత పూర్తి చేయవలసి ఉంటుంది.

రిజర్వ్ డే రోజున గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్..

మ్యాచ్‌కు ముందు మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మధ్యాహ్నం 3:44 గంటలకు వర్షం ఆగిపోవడంతో అంపైర్లు రెండుసార్లు మైదానాన్ని పరిశీలించి, సాయంత్రం 4:40 గంటలకు ఆట ప్రారంభించాలని నిర్ణయించారు. మ్యాచ్ నిర్ణీత సమయం 3:00 కంటే గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..