
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు ముందు, మాజీ క్రికెటర్ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సైమ్ అయూబ్ గురించి కీలక ప్రకటన చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఆరు బంతుల్లో సైమ్ అయూబ్ ఆరు సిక్సర్లు కొట్టగలడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ పొగడ్తలతో హోరెత్తించాడు. అతనికి అలాంటి సామర్థ్యం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
కానీ, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో, హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికే జస్‌ప్రీత్ బుమ్రాకు సులభమైన క్యాచ్ ఇచ్చి సైమ్ అయూబ్ ఔటయ్యాడు. కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ విధంగా, సైమ్ అయూబ్ మొదటి బంతికే ఔటయ్యాడు. అంటే ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో వరుసగా రెండోసారి గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. అంతకుముందు, అయూబ్ ఓమన్‌పై తన ఖాతా తెరవలేకపోయాడు.
ఈ విధంగా, తన్వీర్ అహ్మద్ ఆరు సిక్సర్ల గురించి మాట్లాడుతుంటే ఆసియా కప్‌లో గత రెండు మ్యాచ్‌లలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు ఈ పాక్ ప్లేయర్. దీంతో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించడం లేదు.
సైమ్ అయూబ్ గురించి చెప్పాలంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గోల్డెన్ డక్ బాధితుడిగా మారిన పాకిస్తాన్ తరపున రెండవ బ్యాట్స్‌మన్ అయ్యాడు.
పాకిస్తాన్ తరపున డాషింగ్ బ్యాట్స్‌మన్ అబ్దుల్లా షఫీక్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు సున్నా వద్దే ఔటయ్యాడు. కానీ అతను నాలుగు సార్లు కూడా గోల్డెన్ డక్ బాధితుడు కాలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..