Arshdeep Singh: కుక్కలు మొరుగుతుంటాయ్‌.. పట్టించుకోవద్దు.. టీమిండియా పేసర్‌కు స్టార్‌ బాక్సర్‌ బాసట

Ind vs Pak: ఆసియాకప్‌ సూపర్‌-4 టోర్నీలో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ నేలపాలు చేశాడు టీమిండియా యంగ్‌ పేసర్‌ (Arshdeep Singh). అసిఫ్‌ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో అర్ష్‌దీప్‌పై విమర్శలు వస్తున్నాయి.

Arshdeep Singh: కుక్కలు మొరుగుతుంటాయ్‌.. పట్టించుకోవద్దు.. టీమిండియా పేసర్‌కు స్టార్‌ బాక్సర్‌ బాసట
Arshdeep Singh

Updated on: Sep 06, 2022 | 8:17 AM

Ind vs Pak: ఆసియాకప్‌ సూపర్‌-4 టోర్నీలో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ నేలపాలు చేశాడు టీమిండియా యంగ్‌ పేసర్‌ (Arshdeep Singh). అసిఫ్‌ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో అర్ష్‌దీప్‌పై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా వికిపిడియా పేజీలో అతనిని ఖలీస్తానీ అంటూ నెట్టింట భారీ ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇదే సమయంలో లెఫ్టార్మ్‌ సీమర్‌కు పలువురు బాసటగా నిలుస్తున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అనంతరం విరాట్‌ మాట్లాడూ ఒత్తిడిలో ఇలాంటివి సహజమేనని చెప్పుకొచ్చాడు. ఆతర్వాత హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, మహ్మద్‌ హఫీజ్, ఆకాశ్‌ చోప్రా తదితర క్రికెటర్లందూ అర్ష్‌దీప్‌కు అండగా నిలిచారు. తాజాగా ప్రొఫెషనల్‌ బాక్సర్ విజేందర్ సింగ్‌ (Vijender Singh) కూడా సింగ్‌కు మద్దతు ప్రకటించాడు.

అర్ష్‌దీప్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను తప్పపడుతూ..కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవద్దు’ అంటూ విజేందర్‌ ట్వీట్ చేశాడు. కాగా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తన ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌గా అర్ష్‌దీప్‌ ఫొటోను పెట్టుకున్నాడు. ఇక ఆసియాకప్‌లో భాగంగా నేడు శ్రీలంకతో తలపడనుంది భారత్‌. టోర్నీలో నిలవాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..