IND vs PAK: పాకిస్థాన్‌పై గెలవాలంటే ఆ స్కోర్ సాధించాల్సిందే.. టీమిండియా ప్లాన్ చెప్పేసిన గిల్

India vs Pakistan: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సూపర్ సండే మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. ఈ అధ్బుత మ్యాచ్ కోసం ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిదేళ్ల పగ తీర్చుకునేందుకు భారత్ రంగంలోకి దిగనుండగా, మరోసారి భారత్‌పై విజయం సాధించాలని పాక్ కోరుకుంటోంది.

IND vs PAK: పాకిస్థాన్‌పై గెలవాలంటే ఆ స్కోర్ సాధించాల్సిందే.. టీమిండియా ప్లాన్ చెప్పేసిన గిల్
Shubman Gill World Record

Updated on: Feb 22, 2025 | 9:29 PM

India vs Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ మైదానంలో జరుగుతుంది. దీని కోసం, భారత జట్టు ఏ ప్రణాళికతో మైదానంలోకి ప్రవేశిస్తుంది. ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ విషయానికి వస్తే భారత జట్టు పాకిస్తాన్‌పై ఎంత పరుగుల లక్ష్యాన్ని కలిగి ఉంటుంది? దీనికి సంబంధించి టీం ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒక కీలక ప్రకటన ఇచ్చాడు.

శుభమాన్ గిల్ ఏం చెప్పాడంటే?

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు గెలవాలనే టీమ్ ఇండియా ప్రణాళికలపై శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. మా సరళమైన సూత్రం ఏమిటంటే పరిస్థితులను అంచనా వేసి తదనుగుణంగా ఆడటం. గత మ్యాచ్‌లో మేం ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం పొందడం మా అదృష్టం. ఇది వికెట్ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. నాకు దాన్ని చూసే అవకాశం వచ్చింది. మేం ఖచ్చితంగా దూకుడు, సానుకూల క్రికెట్ ఆడతాం. కానీ, ఇదంతా వికెట్ మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

260 నుంచి 280 మంచి స్కోర్..

‘ఈ రకమైన పిచ్‌పై మొత్తం 260-280 పరుగులు మంచివి. అయితే రెండో వికెట్‌తో మనం 320 లేదా 350 కంటే ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మాకు నిర్దిష్ట లక్ష్యం అంటూ ఏమీ లేదు. కానీ, ఏ పిచ్‌కైనా సగటు స్కోరు కంటే 15-30 పరుగులు ఎక్కువగా స్కోర్ చేయడానికి మేం ప్రయత్నిస్తాం’ అని టీమిండియా వైస్ కెప్టెన్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..