హామిల్టన్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన భారత్‌కు నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ జట్టు ఓడిపోతే మ్యాచ్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఐదు ఓవర్లు ముగిసేలోపే వరుణుడు అడ్డుపడ్డాడు. 4.5 ఓవర్లు ముగిసే సరికి భారతజట్టు స్కోరు 22/0. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో 2 మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్‌ను టీమ్ ఇండియా ప్లేయింగ్ XI నుంచి మళ్లీ తొలగించారు. అతని స్థానంలో దీపక్ హుడాకు అవకాశం లభించింది. అలాగే, గత మ్యాచ్‌లో చాలా భారీగా పరుగులు ఇచ్చిన షార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు.
శార్దూల్‌ను తప్పించడం సమంజసమే అయినా మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న సంజూను రెండో వన్డే నుంచి తప్పించడం మళ్లీ చర్చనీయాంశమవుతోంది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను మంచి రిథమ్‌లో ఉన్నాడని స్పష్టమైంది. మరి, రెండో వన్డేలో అవకాశం ఇస్తే అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది. అయితే ఇది జరగలేదు. శాంసన్‌ను జట్టు నుంచి తప్పించారు. అదే సమయంలో మొదటి వన్డేలో రిషబ్ పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అయినా అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు. బహుశా అతను వన్డే జట్టుకు వైస్-కెప్టెన్ అయినందునేమో. టీమ్ మేనేజ్‌మెంట్ కీపర్ అండ్ బ్యాటర్ కావాలని భావిస్తే.. పంత్ కంటే సంజూ శాంసన్ మెరుగైన ఎంపిక.
ఇక ఇటీవల టీ20 మ్యాచ్‌లలో సూర్యకుమార్ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. కానీ వన్డేల్లో అతని కథ వేరు. ఇక్కడ అతను గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 13, 9, 8, 4 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్ గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 86*, 30*, 2*, 36 పరుగులు చేశాడు. ఈ రికార్డులే చెబుతున్నాయి పంత్, సూర్యల కంటే సంజూ ఎంత బెటరో.. మరి టీమిండియా మేనేజ్‌మెంట్, కెప్టెన్లకు ఈ విషయం అర్థం కావడం లేదేమో! దీంతో టీమిండియా ఎంపికపై మళ్లీ నెట్టింట ట్రోల్ ప్రారంభమైంది. ట్యాలెంట్ ఉన్నా సంజూకు ఛాన్సులు ఎందుకు ఇవ్వడం లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..