India vs New Zealand: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా టాస్‌కి గానీ, మ్యాచ్‌కు గానీ సమయానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ తొలి సెషన్ కూడా కొట్టుకుపోవడంతో అంపైర్లు సమయానికి ముందే లంచ్ ప్రకటించారు. భారత జట్టు మూడు మార్పులు చేయగా, న్యూజిలాండ్ ఒక మార్పు చేయాల్సి ఉంది. ఈ మార్పులన్నీ గాయం కారణంగా చోటుచేసుకున్నవే.
ఆరంభం అదిరింది..
టీమిండియా ఓపెనర్లు ఓవైపు వికెట్ కాపాడుకుంటూ మరోవైపు జట్టు స్కోరును పెంచే క్రమంలోనే 21 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 63 పరుగులు సాధించారు. ఇద్దరూ కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 80 పరుగుల వద్ద టీమిండియాకు వరుసగా మూడు భారీ దెబ్బలు తగిలాయి. 71 బంతుల్లో 44 పరుగులు(7 ఫోర్లు, 1 సిక్స్) చేసి మాంచి ఊపులో ఉన్న శుభ్‌మన్ గిల్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆవెంటనే అజాజ్ మరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాను భారీ దెబ్బ తీశాడు. చటేశ్వర పుజార(0), విరాట్ కోహ్లీ(0) డౌకట్లుగా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(46 పరుగులు, 114 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు), శ్రేయాస్ అయ్యర్(7 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్) బ్యాటింగ్ చేస్తున్నారు. 35 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన భారత్ 105 పరుగులు చేసింది.
అత్యధిక డౌకట్లలో చేరిన విరాట్ కోహ్లీ..
తొలి టెస్టులో విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై టెస్టులో జాయిన్ అయ్యాడు. ప్రాక్టీస్‌లోనూ దుమ్ము దులిపాడు. తీవ్రంగా కసరత్తులు చేసిన కోహ్లీ, రెండో టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వచ్చిన వెంటనే కేవలం 4 బంతులు ఆడి అజాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో టెస్టు కెప్టెన్లలో అత్యధికంగా డకౌట్ల లిస్టులో విరాట్ కోహ్లీ చేరాడు. 10 సార్లు ఇలా డకౌట్లు అయ్యి, రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో 13 సార్లు డకౌట్లతో స్టీఫెన్ ఫ్లెమింగ్ అగ్రస్థానంలో ఉండగా, 10 డకౌట్లతో గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. 8 డకౌట్లతో అథర్టన్, క్రోంజే, ధోని మూడో స్థానంలో నిలిచారు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సార్లు డకౌట్‌లు అయిన లిస్టులోనూ విరాట్ కోహ్లీ చేరాడు. 4 డకౌట్లతో బిషన్ సింగ్ బేడీ(1976), కపిల్ దేవ్(1983), ఎంఎస్ ధోని(2011), విరాట్ కోహ్లీ(2021) నిలిచారు.
అత్యధిక సార్లు డకౌట్లయిన టెస్ట్ కెస్టెన్లు..
13 స్టీఫెన్ ఫ్లెమింగ్
10 గ్రేమ్ స్మిత్
10 విరాట్ కోహ్లీ*
8 అథర్టన్/ క్రోంజే/ ధోని
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్‌లు..
4 బిషన్ బేడీ (1976)
4 కపిల్ దేవ్ (1983)
4 ఎంఎస్ ధోని (2011)
4 విరాట్ కోహ్లీ (2021*)
ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
భారత్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజాలు జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లకు జట్టులో చోటు దక్కింది. దీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో రహానే జట్టుకు సారథ్యం వహించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈరోజు రహానే స్థానంలో కోహ్లి వచ్చాడు.
4 ఏళ్ల తరువాత..
4 సంవత్సరాల తర్వాత జయంత్ యాదవ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. రవీంద్ర జడేజా స్థానంలో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ ప్లేయింగ్ XIలోకి వచ్చాడు. భారత్ తరఫున జయంత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 228 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. అతను ఫిబ్రవరి 2017లో పుణెలో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమ్సన్, టిమ్ సౌథీ
IND vs NZ 2nd Test: గాయం కారణంగా కివీస్‌తో జరిగే ముంబై టెస్ట్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు.. ఎవరెవరంటే..