India vs New Zealand: మ్యాచ్ గెలవాలంటే పిచ్‌ని అధ్యయనం చేయడం తప్పనిసరి. ఆట ఎలాంటి మలుపు తిరుగుతుందో పిచ్ నిర్ణయిస్తుంది. సోమవారం టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదే పనిలో మునిగిపోయారు. వీరిద్దరూ మొదట పిచ్ పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు మైదానంలోకి దూకారు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా పూర్తి స్థాయి పాత్రలో రోహిత్ శర్మకు న్యూజిలాండ్ సిరీస్ కీలకంగా ఉండనుంది. అందుకే గెలిచేందుకు ఎలాంటి అవకాశాలను వదులుకోకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తొలి సిరీస్‌ను విజయంతో మొదలు పెట్టాలని చూస్తున్నారు.
టీమ్ ఇండియా తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌ని చుట్టుముట్టి, ఇటు బౌలింగ్‌లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ హిట్ కావాలనే కోరికతో ఉన్నట్లు ఈ వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోలో రాహుల్ ద్రవిడ్ స్వయంగా రోహిత్ శర్మకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అదే సమయంలో అశ్విన్, ఇతర బౌలర్ల బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ షాట్లు ఆడడం వీడియోలో కనిపిస్తుంది.
కివీస్‌పై దాడికి రోహిత్ శర్మదే బాధ్యత!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో చాలామంది యువకులే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్‌పై దాడి చేసే బాధ్యత రోహిత్ శర్మతో పాటు ఇతర అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌లపై ఉంటుందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. పిచ్‌ను స్టడీ చేసిన కెప్టెన్, కోచ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక రోజు ముందు, రోహిత్, ద్రవిడ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోని పిచ్‌ను పరిశీలిస్తూ కనిపించారు.
జైపూర్‌లో భారత్ రికార్డుకు తిరుగేలేదు..
జైపూర్‌లో ఇంతకు ముందు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఇక్కడ జరగనున్న తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మైదానంలో భారత్ విజయాల రికార్డు బాగుంది. ఇక్కడ ఆడిన 12 వన్డేల్లో భారత్ 8 గెలిచింది. ఆడిన 1 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
New roles ?
New challenges ?
New beginnings ?Energies were high yesterday on Day 1 at the office for #TeamIndia T20I captain @ImRo45 & Head Coach Rahul Dravid. ? ?#INDvNZ pic.twitter.com/a8zlwCREhl
— BCCI (@BCCI) November 16, 2021
? ?: Some snapshots from #TeamIndia‘s 1⃣st practice session in Jaipur last evening. #INDvNZ pic.twitter.com/LcQsQVVNuR
— BCCI (@BCCI) November 16, 2021