Watch Video: శ్రేయాస్‌ అయ్యర్ దెబ్బకు పారిపోయిన భారత పేస్ బౌలర్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో

|

Nov 23, 2021 | 9:26 AM

IND VS NZ: శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer Magic Trick), మహ్మద్ సిరాజ్ న్యూజిలాండ్‌తో టెస్ట్ టీమ్‌లో ఉన్నారు. సిరీస్ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది.

Watch Video: శ్రేయాస్‌ అయ్యర్ దెబ్బకు పారిపోయిన భారత పేస్ బౌలర్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో
India Vs New Zealand Mohammed Siraj, Shreyas Iyer
Follow us on

Shreyas Iyer Magic Trick: టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించిన భారత జట్టు.. ప్రస్తుతం అతిపెద్ద ఫార్మాట్‌లో వారితో తలపడనుంది. నవంబర్ 25 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆ సిరీస్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు తమదైన శైలిలో సరదాగా గడుపుతున్నారు. అలాంటి వినోదభరితమైన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో శ్రేయాస్ అయ్యర్ తన మ్యాజిక్ ట్రిక్ చూపిస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మ్యాజిక్ ట్రిక్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతలా సందడి చేసిందంటే.. మహ్మద్ సిరాజ్ కూడా షాక్ అయ్యేలా చేసింది.

మహ్మద్ సిరాజ్ ముందు శ్రేయాస్ అయ్యర్ పేక మ్యాజిక్ చేశాడు. కార్డు ఎంచుకోవాలని సిరాజ్‌ను కోరాడు. సిరాజ్ కార్డును ఎంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఆ కార్డును చేతి మధ్యలో నొక్కమని అడిగాడు. సిరాజ్ అలాగే చేశాడు. అయ్యర్ వెంటనే రెండవ కార్డు తీసుకొని ఈ ఫాస్ట్ బౌలర్ చేతిలో రుద్దాడు. అకస్మాత్తుగా సిరాజ్ చేతుల్లో వెచ్చదనం వచ్చింది. మరుసటి క్షణం అయ్యర్ సిరాజ్ చేతుల మధ్య మడతపెట్టిన కార్డు.. శ్రేయాస్ చేతిలోకి మారిపోవడం చూపించాడు. దీంతో ఆ కార్డును సిరాజ్‌కు చూపించాడు. అదే సమయంలో అయ్యర్ చేతిలో ఉన్న కార్డు ఆటోమేటిక్‌గా సిరాజ్ చేతుల్లోకి వెళ్లింది. ఈ మాయాజాలం చూసి భయపడిన సిరాజ్ అక్కడి నుంచి పారిపోయాడు.

శ్రేయాస్ అయ్యర్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తాడు..
శ్రేయాస్ అయ్యర్ గొప్ప బ్యాట్స్‌మెన్. అతను మ్యాజిక్ ట్రిక్స్ చేస్తాడని మీకు తెలియజేద్దాం. అతని మ్యాజిక్ ట్రిక్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. టీమ్ ఇండియాకు చెందిన ఈ ఆటగాడు గొప్ప డ్యాన్సర్ కూడా. రీసెంట్‌గా విరాట్ కోహ్లిని టీమ్ ఇండియా బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడిగితే.. శ్రేయాస్ అయ్యర్‌ను నంబర్ 1 డ్యాన్సర్ అని పేర్కొన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్నాడు. అతనికి అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని నమ్ముతారు. మిడిల్ ఆర్డర్‌లో అయ్యర్‌కు అవకాశం ఇవ్వొచ్చు. కాగా, మిడిలార్డర్‌లో అతనికి, శుభ్‌మన్‌ గిల్‌కు మధ్య పోటీ నెలకొంది. సోమవారమే, టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఇకపై శుభ్‌మన్ గిల్‌ను ఓపెనింగ్ చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయాలని టీమ్ ఇండియా కోరుకుంటోంది.

Also Read: IPL 2022: చెన్నైతో ఆ ప్లేయర్ బంధం ముగిసినట్టేనా? వేలానికి ముందు బిగ్‌‌న్యూస్ చెప్పిన సీఎస్‌కే సీఈవో..!

India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు కష్టమే: గౌతమ్ గంభీర్