Hardik Pandya: పాకిస్థాన్‌పై ఘోర పరాజయం తరువాత న్యూజిలాండ్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యాపై చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. అతను న్యూజిలాండ్‌తో ఆడాలా వద్దా అనే దానిపై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలెసిందే. అయితే తుది నిర్ణయం మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి మనసులో ఏముందో మాత్రం ఇంకా తెలియదు. ఇక, ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ పరీక్ష నేడు జరగనుంది. భారత ఆల్ రౌండర్ ఈ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, న్యూజిలాండ్‌తో ఆడే ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకుకోనున్నాడు.
ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదిక ప్రకారం, “హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ పరీక్ష ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈ టెస్టులో అతనికి నెట్స్‌లో 3 నుంచి 4 ఓవర్ల స్పెల్ ఇవ్వవనున్నారు. ఈ ఫిట్‌నెస్ పరీక్ష తర్వాతే న్యూజిలాండ్‌తో జరిగే జట్టులో హార్దిక్‌ను చేర్చే విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ఖరారు చేస్తుంది. అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు హార్దిక్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కానీ, నెట్స్‌లో బౌలింగ్‌కు, మ్యాచ్‌లో తేడా ఉంటుంది. హార్దిక్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. అయితే ఈరోజు అతని ఫిట్‌నెస్, మ్యాచ్‌లో బౌలింగ్ చేయడానికి ఎంత ఫిట్‌గా ఉన్నాడో టెస్ట్ చేయనున్నారు.
హార్దిక్ పాండ్యా చాలా కాలంగా బౌలింగ్‌కు దూరం..
టీమిండియా ఆల్ రౌండర్ చాలా కాలంగా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. మొత్తం IPL 2021లో బౌలింగ్ చేయలేదు. దీని తరువాత, అతను వార్మప్ మ్యాచ్‌లలో, పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచులోనూ బౌలింగ్ చేయలేదు. క్రికెట్ మాజీలంతా హార్దిక్‌కు జట్టులో సరైన స్థానం కల్పించకపోవడానికి ఇదే కారణం అని అంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పాండ్యా న్యూజిలాండ్‌పై ఆడి తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలంటే ఈరోజు జరిగే ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
హార్దిక్ బ్యాటింగ్ కూడా అంతంతమాత్రంగానే..
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌తో కూడా టీమిండియా ఇబ్బందులు పడుతోంది. ఫాంలో కూడా లేడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతని బ్యాట్ పనిచేయలేదు. అంతకు ముందు ఐపీఎల్ 2021లో కూడా అతని శైలి మసకబారింది. అక్కడ అతను 12 మ్యాచ్‌లలో 14.11 సగటుతో 127 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యుత్తమ స్కోరు 40 నాటౌట్. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ కూడా 113.39గా ఉంది.
Also Read: T20 World Cup 2021: బౌండరీలు బాదడంలో వీరి రూటే సపరేటు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?