India vs New Zealand: ముంబైలో అకాల వర్షాలతో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మొదటి రోజు ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా వాంఖడే స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం రోజంతా వర్షం కారణంగా ఇరు జట్లు తమ శిక్షణా సెషన్లను కూడా రద్దు చేసుకోవలసి వచ్చింది. గురువారం కూడా వర్షం కురుస్తుందని తెలుస్తోంది. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉంది. ఇలాం పరిస్థితిలో, వాంఖడే స్టేడియంలో కాకుండా ఇండోర్ ప్రాక్టీస్ సౌకర్యం ఉన్న బాంద్రా కుర్లా క్యాంపస్ మైదానానికి భారత జట్టు వెళ్తుంది. వాంఖడే స్టేడియం పిచ్‌లో పచ్చిక లేదు. ఇది స్లో బౌలర్లకు సహాయపడుతుంది.
అయితే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టెస్టులో వాంఖడే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా, పిచ్‌ను కప్పి ఉంచారు. దీని కారణంగా ఉపరితలం కింద చాలా తేమ ఉంటుంది. అదనపు తేమ ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్లకు కాన్పూర్ కంటే ఎక్కువ సహాయం చేస్తుంది. కానీ, ఇలాంటి వికెట్ స్పిన్నర్లకు కూడా చాలా మలుపు ఇవ్వనుంది. శుక్రవారం వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే రెండు జట్లు రెండవ రోజు నుంచి ఐదవ రోజు వాతావరణానికి భంగం కలగకుండా ఉండాలని ప్రార్థిస్తాయి.
అదే సమయంలో డిసెంబర్ 2 తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు వాతావరణం తెరుచుకునే అవకాశం కూడా వ్యక్తమవుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయానికి ఒక వికెట్ దూరంలో నిలిచింది. దీంతో న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారనుంది..
ఈ మ్యాచ్ కోసం అందరి దృష్టి కూడా భారత జట్టు కలయికపైనే నిలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడంతో మయాంక్ అగర్వాల్ నిష్క్రమణ దాదాపు ఖాయమైంది. ఎందుకంటే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అజింక్యా రహానేకి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే సహా సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచారు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఇషాంత్ శర్మ స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. ఇది కాకుండా, వారిద్దరూ ఉమేష్ యాదవ్‌తో ఫాస్ట్ బౌలింగ్ త్రయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో అక్షర్ పటేల్ ఔటవ్వాల్సి ఉంటుంది.